అవిధేయత వలన నష్టము.
Lessons from Disobedience Telugu
మూలవాక్యము : …దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును-కొలస్సీ3:6 (అవిధేయత అనగా మాటను వ్యతిరేకించుట లేక మాట వినకపోవుట, చెప్పినది చేయకపోవుట)
(కొలొస్సయులకు) 3:6
6.వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును.
3:6 A రోమ్ 1:18; ఎఫెసు 5:6; B యెహె 16:45-46; 1 పేతురు 1:14; C ఎఫెసు 2:2-3; D యెషయా 57:4; 2 పేతురు 2:14; ప్రకటన 22:15
1.) ఆదాము – హవ్వల అవిధేయత.
(ఆదికాండము) 3:11,16
11.అందుకాయననీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
16.ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
3:16 మనిషి పతనం సమయంనుంచి స్త్రీ పురుషుడికి లోబడాలి (ఎఫెసు 5:22; కొలస్సయి 3:18; 1 తిమోతి 2:11-15; 1 పేతురు 3:1-5).
శిక్ష : 1. స్త్రీకి గర్భవేదన.
(ఆదికాండము) 3:16
16.ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
2. భూమి శపించబడుట.
(ఆదికాండము) 3:17
17.ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
3. ప్రయాస.
(ఆదికాండము) 3:17
17.ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
3:17 A ఆది 5:29; ప్రసంగి 2:22-23; యెషయా 24:5-6; రోమ్ 8:20-22; B యోబు 14:1; కీర్తన 127:2; C యోబు 5:6-7; ప్రసంగి 2:17; యోహాను 16:33; D ఆది 2:16-17; 3:6, 11; 1 సమూ 15:23-24; యోబు 21:17; ప్రసంగి 1:2-3, 13-14; 2:11; 5:17; యిర్మీయా 7:23-24; మత్తయి 25:26-27, 45; లూకా 19:22; రోమ్ 3:19; E కీర్తన 90:7-9; మత్తయి 22:12
4. నీ ముఖము చెమటకార్చి ఆహారము తిందువు.
(ఆదికాండము) 3:19
19.నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
3:19 A ఆది 2:7; యోబు 34:15; కీర్తన 90:3; 104:29; ప్రసంగి 12:7; B ప్రసంగి 3:20; C ఆది 18:27; 23:4; యోబు 1:21; 17:13-16; 21:26; కీర్తన 22:15, 29; 103:14; సామెత 21:16; ప్రసంగి 1:3; 5:15; దాని 12:2; 1 కొరింతు 15:21-22; ఎఫెసు 4:28; 2 తెస్స 3:10; D యోబు 19:26; ప్రసంగి 1:13; రోమ్ 5:12-21; E 1 తెస్స 2:9
5. మరణ దండన.
(ఆదికాండము) 3:19
19.నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
6. తోటనుండి వెళ్లగొట్టబడుట.
(ఆదికాండము) 3:24
24.అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
3:24 “కెరూబులు”– నిర్గమ 25:18-22; యెహె 1:5-14; యెహె 10:1-10లో కెరూబుల వర్ణన ఉంది. కెరూబులంటే ఎప్పుడూ దేవుని మహిమ, పవిత్రలతో సంబంధం కలిగిన పరలోక జీవులు లేక ఆయన మహిమ, పవిత్రతలకు సంకేతాలు అని అర్థం అవుతున్నది. ఇక్కడ తోటకు వెళ్ళే దారికి కావలిగా ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనిషి చేసిన పాపం తాలూకు ఫలితాలు అతి స్పష్టంగా ఉన్నాయి. ఆ ఫలితాలు నేటికీ ఈ లోకంలో కనిపిస్తున్నాయి. సిగ్గు; దోషాన్ని కప్పిపుచ్చు కునేందుకు వ్యర్థ ప్రయత్నాలు; భయం; దేవునినుంచి దాక్కొనే ప్రయత్నాలు; పనికిమాలిన సాకులు; సృష్టిపైన శాపం; మనుషులకు బాధ; బానిసత్వం; కష్టమైన పని; మరణం; పరమానంద స్థానం నుంచి బహిష్కారం. మనిషి దేవుని పోలికలో తయారయ్యాడు (1:26). పాపం చేసినందువల్ల ఆ పోలిక వికృతం అయిపోయింది. కొత్త ఒడంబడికలో వెల్లడైన దేవుని ఉద్దేశం విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (రోమ్ 8:29; 1 యోహాను 3:2).
3:24 A కీర్తన 104:4; హీబ్రూ 1:7; B నిర్గమ 25:18-22; C 1 దిన 21:16-17; హీబ్రూ 10:18-22; D ఆది 2:8-9; నిర్గమ 25:2; సంఖ్యా 22:23; యెహో 5:13; 1 సమూ 4:4; 1 రాజులు 6:25-35; కీర్తన 80:1; 99:1; యెహె 10:2-22; యోహాను 14:6
7. జీవ వృక్షములో పాలులేదు.
(ఆదికాండము) 3:24
24.అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
2.) ఫరో యొక్క అవిధేయత .
(నిర్గమకాండము) 5:2
2.ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను.
5:2 A నిర్గమ 3:19; 2 రాజులు 18:35; యోబు 21:15; B యోహాను 16:3; రోమ్ 1:28; 2 తెస్స 1:8; C 1 సమూ 2:12; 2 దిన 32:15, 19; కీర్తన 10:4; 12:4; 14:1; యిర్మీయా 44:16-17
శిక్ష : ఐగుప్తీయుల ఇంటిలో శవము.
(నిర్గమకాండము) 12:29,30,31
29.అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.
12:29 A నిర్గమ 4:23; కీర్తన 78:51; B నిర్గమ 11:4-5; సంఖ్యా 8:17; 33:4; కీర్తన 105:36; 135:8; 136:10; C నిర్గమ 12:12; D నిర్గమ 9:6; 13:15; సంఖ్యా 3:13; యోబు 34:20; యెషయా 24:22; 51:14; యిర్మీయా 38:6, 13; జెకర్యా 9:11; 1 తెస్స 5:2-3; హీబ్రూ 11:28; 12:23
30.ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
12:30 A నిర్గమ 11:6; B ఆమోసు 5:17; C సామెత 21:13; మత్తయి 25:6; యాకోబు 2:13
31.ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించివారితోమీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహో వాను సేవించుడి.
12:31-32 11:1. ఫరో పశ్చాత్తాపం, వినయంలాంటి భావాలు చూపించినది ఇక్కడే. అయితే ఇది ఎంతో సేపు నిలువలేదు. పైగా అదంతా కేవలం స్వార్థపూరితం.
3. మోషే అవిధేయత .
(నిర్గమకాండము) 20:8,9,10,11
8.విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
20:8-11 ఆది 2:2-3; నిర్గమ 23:12; 31:13-17; 34:21; 35:2-3; ద్వితీ 5:12-15; యెషయా 58:12-13. విశ్రాంతి దినం నెమ్మదిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా గడపవలసిన రోజు. ఇస్రాయేల్‌ప్రజ సమకూడి దేవుణ్ణి ఆరాధించే రోజు కూడా ఇదే (లేవీ 23:3). ఆరు రోజులు పని చేసిన తరువాత ఇలాంటి రోజు ఒకటి మనిషికి అవసరమని దేవునికి తెలుసు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదులకు శనివారం విశ్రాంతి దినంగా ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద క్రైస్తవులు లేరు (రోమ్ 6:14). సాధారణంగా వారు ఆదివారాన్ని విశ్రాంతిదినంగా ఆచరిస్తున్నారు (అపొ కా 20:7; 1 కొరింతు 16:2). ఏ రోజు అన్నది ముఖ్యం కాదు. ఆ రోజును విశ్రాంతికీ ఆరాధనకూ ఉపయోగించుకోవాలన్నది ముఖ్యం. క్రొత్త ఒడంబడిక గ్రంథమంతటిలోనూ ఎక్కడా శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలన్న ఆజ్ఞ క్రైస్తవులకు ఇవ్వడం కనిపించదు.
20:8 A ఆది 2:3; నిర్గమ 31:13-16; లేవీ 19:3, 30; 23:3; 26:2; B నిర్గమ 16:23-30; 23:12; యెషయా 56:4-6
9.ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
10.ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
20:10 A ద్వితీ 5:14-15; B నిర్గమ 34:21; సంఖ్యా 15:32-36; C నిర్గమ 16:27-28; D ఆది 2:2-3; నిర్గమ 23:9-12; 31:13; ద్వితీ 16:11-12; 24:14-22; నెహెమ్యా 10:31; 13:15-21; లూకా 23:56
11.ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
20:11 A ఆది 1:1-2; 2:2-3; నిర్గమ 31:17; మార్కు 2:27-28; B కీర్తన 95:4-7; C అపొ కా 20:7
శిక్ష: మోషే, కనాను పోగొట్టుకున్నాడు.
(నిర్గమకాండము) 20:12,24
12.నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
20:12 A నిర్గమ 21:15, 17; లేవీ 19:3; ద్వితీ 5:16; సామెత 1:8-9; 20:20; 23:22-25; 30:17; మత్తయి 19:19; మార్కు 7:10; 10:19; లూకా 18:20; ఎఫెసు 6:1-3; కొలస్సయి 3:20; B ద్వితీ 32:47; సామెత 3:16; మత్తయి 15:4-6; C ద్వితీ 4:40; సామెత 15:5; 30:11; D ద్వితీ 25:15; 1 రాజులు 2:19; 2 రాజులు 2:12; మలాకీ 1:6; E లేవీ 19:32; ద్వితీ 4:26; సామెత 28:24
24.మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వ దించెదను.
20:24 ఇక్కడ వెల్లడి అవుతున్న ధర్మశాస్త్రం తెచ్చేశాపం నుంచి పాపులను విడిపించేందుకు బలి అయిన క్రీస్తుకే ఈ హోమబలులు, శాంతిబలులు సూచనలు (గలతీ 3:13-14). ఈ అర్పణల గురించి నోట్స్ లేవీ 1,3 అధ్యాయాల్లో చూడండి.
4.) ఆకాను అవిధేయత.
(యెహొషువ) 7:1,11
1.శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమా రుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.
7:1 “అపరాధం చేశారు”– ఒకేవ్యక్తి పాపం చేశాడు. అయితే దేవుడు ఆ జాతినంతటికి దోషమున్నట్లు ఎంచాడు. దేవుడు తన ప్రజలనందరినీ ఒకటిగా పరిగణిస్తాడు. ఒక్క వ్యక్తి పాపం అందరిపైనా ప్రభావం చూపుతుంది. అందరూ దాని విషయం బాధ్యులే (వ 11,20,22; లేవీ 4:13-21; 2 సమూ 21:1-2). వారిలో ఏ ఒక్క వ్యక్తీ తనకు తానుగా జీవించడం సాధ్యం కాదు. మన చర్యలు ఎప్పుడూ ఇతరులపై మంచి, లేదా చెడు ప్రభావాన్ని చూపుతాయి (రోమ్ 14:7, 13; 1 కొరింతు 5:1-2, 6; 12:26-27).
11.ఇశ్రాయేలీ యులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.
7:11 పాపం చేసినది ఒకడే – ఆకాను. అయితే దేవుని మాటలు చూడండి – “ఇస్రాయేల్‌ప్రజ పాపం చేశారు”.
శిక్ష :1. కుటుంబముపైకి శిక్ష.
(యెహొషువ) 7:24
24.తరువాత యెహోషువయు ఇశ్రా యేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.
7:24-25 మన పాపం ఇతరులపై చూపిన ప్రభావానికి దేవుడు మనల్నే బాధ్యులుగా ఎంచుతాడు (6:18; లూకా 17:1-2). ఆకోరు అంటే “బాధ”. అయ్యో, పాపం దేవుని ప్రజలను ఎంత బాధిస్తుంది! వారు ఆకాను భార్య బిడ్డలను కూడా చంపేశారు. ఆకాను చేసినది వారికి తెలిసి కూడా వారు నోరెత్తక అపరాధులయ్యారన్న మాట.
2. వెండి, బంగారం నాశనం – యెహోషువ 7:24
3. తాను శిక్షింపబడెను – యెహోషువ 7:24-26
ముగింపు : దేవుని విధేయత చూపగలవా?
మిషనరీ జీవిత చరిత్రల కోసం.. click here