Christian Theology Telugu
క్రైస్తవ వేదాంత శాస్త్రం
Theos, Logos అను రెండు గ్రీకు పదముల కలయికచే ఏర్పడిన పదం Theology.
Theos అనగా God (దేవుడు);Logos అనగా Word (వాక్కు), Doctrine (సిద్ధాంతము), Discourse (సంభాషణ).
A. నిర్వచనము (Definition): “వేదాంతము (Theology) అనగా దేవుని గూర్చియు, దేవునికి ప్రపంచమునకు ముఖ్యముగా దేవునికి మానవునికి మధ్యగల సంబంధమును గూర్చి తెలిపే శాస్త్రం”.ఒక మాటలో దేవ శాస్త్రము.
శాస్త్రం :- క్రమ పరచబడిన రూఢియైన జ్ఞానం (Organised Study)
B. వివరణ:థియాలజి దేవుని వ్యక్తిత్వము గూర్చి, ఆయన కార్యములను గూర్చి తెలియజేయును.
- His being (ఆయన ఉనికి): ఆయన ఎవరో (Who He is) ఆయన గుణగణములను గూర్చి వివరించును.
- His Works: ఆయన చేయు కార్యములను గూర్చి (What He does) వివరించును.
ఆయన చేయు కార్యములు రెండు :
a. సృష్టి :- కీర్తన 19:1; కీర్తన 8:3; యెషయా 43:7; b. విమోచన :- 1కొరింథి 6:19, 20.
C. థియాలజి యొక్క ఆవశ్యకత : థియాలజిలో వ్రాయబడి యున్న సత్యములు బైబిలు లోనివేగదా థియాలజి అనే ప్రత్యేక శాస్త్రమెందుకు ? బైబిలు పఠిస్తే చాలదా?
- బైబిలు నందు ఆ యా విషయాలకు సంబంధించిన సత్యములు ఒక్కచోట సమకూర్చబడి, క్రమపర్చబడి ఉండలేదు. అవి అక్కడక్కడ పొందుపరచబడినవి. ఆ కారణమున మనము ఆయా ఉపదేశములను సులభముగా గ్రహించి పట్టుకొనజాలము. థియోలజిలోనైతే ఆయా ఉపదేశములకు సంబంధించిన విషయాలు ఒక్కచోట సమకూర్చబడి యుండును.
- ఈ రీతిగా సత్యములు సమకూర్చబడి ఉండుటచే విశ్వాసులకు ఆత్మీయా భివృద్ధియు, సేవకులకు వారి సేవా పోరాటమునందు బలమైన పట్టును ఇచ్చుటయే గాక సంఘమునకు క్షేమకరమైన చక్కని మార్గదర్శిగా ఉండును.
- ఇట్లు బైబిలు లోని ఆయా భాగములను ఒక చోట సమకూర్చి, ఒకదానితో నొకటి సరి పోల్చి పరిశోధించుట లేఖనాను సారమైనది. (యోహా 5:39; 1కొరింథి 2:13; II తిమోతి 2:15; అ.కా 17:11.)
D. థియాలజి నేర్చుకొనుటలో మన యత్నం :– దేవుడు, ఆయన స్వభావం, ఆయన ఆజ్ఞలు, ఆయన లోకమును పరిపాలించే విధానము, ఆయన సృష్టి నిర్మాణము, లోకములో పాప ప్రవేశము, పాప విమోచనా విధానము, మనిషి నమ్మదగిన సిద్ధాంతములు, అతడు చేయవలసిన విధులు, పొంద బోయే స్థితి మున్నగు వాటి విషయమైన సత్యములను తెల్సికొని క్రమ పరచి సంధింప చేయుట మన యత్నమైయున్నది.
E. వేదాంతము యొక్క మూలములు (Sources of Theology): ఇవి ముఖ్యంగా మూడు.
- సృష్టి 2. మనుష్యుడు, 3. పరిశుద్ధ లేఖనములు.
- సృష్టి (Creation) :- దేవుడు సృష్టియందు తనను తాను కొంత వరకు బయలు పరచు కొనెను. (రోమా 1:20; కీర్తన 19:1,2; అ.కా 14:17.)
- మనుష్యుడు (Human being) :- దేవుడు ఇంకా కొంతమట్టుకు మనిషి యందు తనను తాను బయలు పరచుకొనెను (ఆది 1:27). సృష్టికి కలుగజాలని గుణములు అనగా ఆత్మ, ఇచ్చ, వివేచన, నీతి స్వభావము మనిషికి కలవు. రోమా 1:18-22; 2:15
- పరిశుద్ధ లేఖనాలు (Holy Scriptures) :- అన్నిటి కంటెను మించి పాత, క్రొత్త నిబంధనలు ముఖ్యమైన మూలములు.
F. వేదాంతము యొక్క పరిమితులు (Limits of theology):
- దేవుడు సర్వజ్ఞుడు, మనం అల్పజ్ఞులం. కనుక ఆయనను గూర్చి సంపూర్ణంగా తెలిసికొనలేము. యోబు 11:7; రోమా 11:33-34; 1కొరింథి 13:9,10.
- పాపం వలన మన మనస్సులు అంధకారమాయెను. రోమా 1:18, 22-24; యెషయా 44:18; హెబ్రీ 4:2.
- మనం తెల్సికొనగోరే ఆయా సంగతులన్నియు దేవుడు సృష్టి, మనిషి, లేఖనములయందు బయలు పరచలేదు. కారణము ఏమనగా అవన్నియు మన (మనష్య జాతి) రక్షణకవసరమైనవి కావు. కొన్ని మర్మములుగా ఉన్నాయి. ద్వితి 29:29.
- దేవుడు లేఖనములయందు బయలు పరచిన అనేక సంగతులను ముఖ్యంగా వాటిని మనం పరిపూర్ణముగా గ్రహించలేము. 1కొరింథి 13:12; 1 యోహాను 3:1,2.
- దైవ సంబంధమైన వాటిని తెలుపుటకు మనకు తరచుగా తగిన భాష దొరకదు.
G. వేదాంతమును ప్రయోజనకరంగా నేర్చుకొనుటకు అవసరమైన సహాయములు :- (Necessary Aids)
- నూతన హృదయము :- వేదాంతమును నేర్చుకొనుటకు ఈ లోక జ్ఞానం, పాండిత్యం సరిపోవు. (1కొరింథి 2:14; యోహాను 3:3; హెబ్రి 4:2.) మార్పు నొందిన హృదయం లేకపోతే వేదాంతం నేర్చుకొనుట కష్టం. (వేదాంతము రాద్దాంతముగా కనబడును).
- సరియైన, నిబ్బరమైన, క్రమశిక్షణాయుతమైన మనస్సు:- మనో సోమరులు, అవివేకులు, ఓర్పులేనివారు సరిగా నేర్చుకొనలేరు..
- దేవుని వాక్యము (పరిశుద్ధ లేఖనాలు).
- పరిశుద్ధాత్ముడు : లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగదు. పరిశుద్ధాత్మ ఆయనను, వాక్య భావములను బయలు పరచును. 1కొరింథి 2:9-13; యోహాను 16:13-14.
H. వేదాంతము నేర్చుకొనుట వలన ప్రయోజనములు :
- మనోసంబంధమైన ఉపయోగం :- దేవుని గూర్చి, మనుష్యుని గూర్చి, ప్రపంచమును గూర్చిన సత్యములను తెలుసు కోవడం వలన అసత్యమును, దుర్బోధలను, దురభిప్రాయములను గ్రహించి వాటికి దూరంగా ఉండటానికి అవకాశం కలదు.
- ఆత్మసంబంధమైన ఉపయోగం :- దేవుని యెడల మనకు గల విశ్వాసం బలమొందును. దేవుని యెడల మనకు గల ప్రేమ, వినయములు పెంపారును. మనస్సాక్షి మరింతగా వెలిగింప బడును. హృదయమునకు మరింత పరిశుద్ధత కలుగును. 2 పేతురు 3:18; కీర్తన 119:130; 2 తిమోతి 3:16,17.
- పని సంబంధమైన ఉపయోగం : దేవుని సంఘాన్ని పటిష్టంగా కట్టటానికి, విమతములను పడగొట్టటానికి ఉపకారి. ఒక సిద్దాంతాన్ని లేక ఉపదేశాన్ని హెచ్చించ దగినంత కంటే ఎక్కువ హెచ్చించి మిగిలిన వాటిని తగ్గించకుండ ఉండుటకు ఉపయోగ పడును. తీతు 1:9; 2 కొరింథి 2:15,16.
Division of Theology (వేదాంతము విభజన)
- Bibliology – బైబిలును గూర్చిన ఉపదేశము
- Theology Proper – ప్రత్యేకంగా దేవునిని గూర్చిన ఉపదేశము
- Angelology – దేవదూతలను గూర్చిన ఉపదేశము
a) Angelology b) Satanology – సాతానును గూర్చి - Anthropology – మానవుని గూర్చిన ఉపదేశము.
- Hamartiology – పాపమును గూర్చిన ఉపదేశము
- Soteriology – రక్షణను గూర్చిన ఉపదేశము
a) Christology – క్రీస్తును గూర్చిన ఉపదేశము b) Soteriology – రక్షణ కార్యం యొక్క అన్వయము - Pneumatology – పరిశుద్ధాత్మను గూర్చిన ఉపదేశము
- Ecclesiology – సంఘమును గూర్చిన ఉపదేశము
- Eschatology – చివరి సంగతులను (యుగాంతము) గూర్చిన ఉపదేశం.
క్రైస్తవ వేదాంతము: తరచుగా అడిగే ప్రశ్నలు (Christian Theology FAQs in Telugu)
1. మనకు బైబిలు ఉండగా థియాలజి (దైవశాస్త్రం) ఎందుకు అవసరం? (Why is Theology necessary if we already have the Bible?)
విశ్వాసానికి సంబంధించిన సత్యాలన్నీ బైబిలులో ఉన్నప్పటికీ, థియాలజి ఎంతో అవసరం. ఎందుకంటే బైబిలులోని సత్యాలు ఒకేచోట క్రమపరచబడి ఉండలేదు, అవి అక్కడక్కడ పొందుపరచబడి ఉన్నాయి. థియాలజి అనేది “క్రమ పరచబడిన రూఢియైన జ్ఞానం” (Organised Study). ఇది చెల్లాచెదురుగా ఉన్న సత్యాలను ఒకచోట చేర్చి, వాటిని సరిపోల్చి, సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ క్రమబద్ధమైన అధ్యయనం విశ్వాసులకు ఆత్మీయాభివృద్ధిని, సేవకులకు బలమైన పట్టును ఇస్తుంది మరియు సంఘానికి చక్కని మార్గదర్శిగా ఉంటుంది.
2. క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం వేదాంతము యొక్క ముఖ్య మూలములు ఏవి? (What are the primary sources of Theology?)
- సృష్టి (Creation): దేవుడు సృష్టియందు తనను తాను కొంత వరకు బయలుపరచుకొనెను.
- మనుష్యుడు (Human Being): దేవుడు మనిషి యందు, ముఖ్యంగా సృష్టికి లేని గుణాలైన ఆత్మ, వివేచన, నీతి స్వభావాల ద్వారా తనను తాను బయలుపరచుకొనెను.
- పరిశుద్ధ లేఖనాలు (Holy Scriptures): పాత మరియు క్రొత్త నిబంధనలు అన్నిటికంటే ముఖ్యమైన మూలములు.
3. వేదాంతాన్ని అధ్యయనం చేయడంలో మానవ అవగాహనకు ఉన్న పరిమితులు ఏమిటి? (What are the limitations of human understanding in studying Theology?)
మనం దేవుని గూర్చి సంపూర్ణంగా తెలుసుకోలేకపోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి:
- అల్పజ్ఞులం: దేవుడు సర్వజ్ఞుడు, కానీ మనం అల్పజ్ఞులం కాబట్టి ఆయనను గూర్చి సంపూర్ణంగా గ్రహించలేము.
- పాప ప్రభావం: పాపం వలన మన మనస్సులు అంధకారమాయెను.
- మర్మములు: రక్షణకు అవసరమైనవి తప్ప మిగిలిన విషయాలను దేవుడు మర్మములుగా ఉంచాడు.
- భాష: దైవ సంబంధమైన వాటిని వివరించడానికి మానవ భాష తరచుగా సరిపోదు.
4. కేవలం తెలివి మరియు పాండిత్యంతో ఎవరైనా వేదాంతాన్ని సమర్థవంతంగా అధ్యయనం చేయగలరా? (Can anyone study Theology effectively using only intellect?)
లేదు, వేదాంతమును నేర్చుకొనుటకు కేవలం ఈ లోక జ్ఞానం సరిపోదు. దీనికి కొన్ని ప్రత్యేక సహాయములు అవసరం:
- నూతన హృదయము: మార్పు నొందిన హృదయం లేకపోతే వేదాంతం నేర్చుకొనుట కష్టం.
- క్రమశిక్షణ కలిగిన మనస్సు: సరియైన, నిబ్బరమైన మనస్సు ఉండాలి; మనో సోమరులు దీనిని సరిగా నేర్చుకోలేరు.
- పరిశుద్ధాత్ముడు: లోక జ్ఞానం దేవుని ఎరుగదు కాబట్టి, వాక్య భావములను గ్రహించుటకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం.
5. వేదాంతాన్ని అధ్యయనం చేయడం వల్ల విశ్వాసికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are the benefits of studying Theology?)
వేదాంత అధ్యయనం మూడు రకాలుగా ఉపయోగపడుతుంది:
- మనోసంబంధమైన ఉపయోగం: అసత్యమును, దుర్బోధలను గ్రహించి వాటికి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.
- ఆత్మసంబంధమైన ఉపయోగం: దేవుని యెడల విశ్వాసం, ప్రేమ, వినయములు పెరుగుతాయి మరియు మనస్సాక్షి వెలిగింపబడుతుంది.
- పని సంబంధమైన ఉపయోగం: దేవుని సంఘాన్ని పటిష్టంగా కట్టడానికి మరియు ఒక సిద్ధాంతాన్ని హెచ్చించదగినంత కంటే ఎక్కువ హెచ్చించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.
6. వేదాంతము (Theology) యొక్క ముఖ్య విభాగాలు ఏమిటి? (What are the major divisions of Theology?)
వేదాంతము ఈ క్రింది విధంగా విభజించబడింది:
- Bibliology: బైబిలును గూర్చిన ఉపదేశము.
- Theology Proper: ప్రత్యేకంగా దేవునిని గూర్చిన ఉపదేశము.
- Angelology & Satanology: దేవదూతలను మరియు సాతానును గూర్చిన ఉపదేశము.
- Anthropology: మానవుని గూర్చిన ఉపదేశము.
- Hamartiology: పాపమును గూర్చిన ఉపదేశము.
- Soteriology: రక్షణను గూర్చిన ఉపదేశము (క్రీస్తును గూర్చిన ఉపదేశముతో సహా).
- Pneumatology: పరిశుద్ధాత్మను గూర్చిన ఉపదేశము.
- Ecclesiology: సంఘమును గూర్చిన ఉపదేశము.
- Eschatology: యుగాంతము (చివరి సంగతులను) గూర్చిన ఉపదేశం.
బైబిల్ ప్రశ్నలు – జవాబులు కొరకు..CLICK HERE




