Augustine Biography Telugu – అగస్టీన్ జీవిత చరిత్ర

 అగస్టీన్ జీవిత చరిత్ర
Augustine Biography Telugu

 అగస్టీన్ 354 వ సంవత్సరములో ఉత్తర ఆఫ్రికాలోని ‘తగస్టీ’ అనే స్థలములో ఫ్యాట్రిక్, మోనికా అనే దంపతులకు జన్మించెను. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికి అన్యుడు, కోపిష్ఠి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే, ఇతని తల్లి అయిన మోనికా రక్షించబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని ఆశించి ప్రార్థించెడిది. 

 అగస్టీన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యనభ్యసించెను. మంచి విద్యావంతుడు, పుస్తకములు చదువుట ఇతనికి బహు ప్రీతి. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకొనెను. గాని ఆ భాషలలో ఉన్న కట్టు కథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడుచేసుకొనెను. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి యుండినందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడెను. కనుక బైబిల్ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేసెను. 

 ఈయన తల్లియైన మోనికా తన కుమారుని జీవితం మారవలెనని కన్నీటితో ప్రార్థించెడిది. అగస్టీన్ తన తల్లి ప్రార్థనను అపహసించి, ఒక పని పిల్లతో అక్రమ సంబంధము పెట్టుకొని అనేక సంవత్సరములు రోత జీవితము జీవి. అయితే, ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గము వెదకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపములనుండి విడుదల పొందగోరి విఫలుడాయెను. 

 ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూచి ‘నాకంటే అతడే మెరుగుగా ఉన్నాడే’ అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ‘ఆండ్రూస్’ అనే ఒక బిషప్పు గారి యొద్దకు అతనిని తీసికొని వెళ్ళగా; ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి, సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి; యేసుక్రీస్తు సిలువను గూర్చి బోధించగా అగస్టీన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించుట మొదలు పెట్టెను. 

 ఆలాగున ఒక రోజు ప్రార్థించుకొనుచుండగా “పరిశుద్ధ గ్రంథము తీసికొని చదువు” అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును వినెను. అతడు బైబిల్ తీసి చదువగా “మోసకరమైన దురాశలవలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి” అన్న వాక్యముపై అతని దృష్టిపడెను. (ఎఫెసీ 4:22 – 24 ) చదివి లోతైన పశ్చాత్తాపముతో ప్రార్థించిన అగస్టీన్ మారు మనస్సు పొందెను. 388వ సంవత్సరములో ‘ఈస్టర్’ రోజున బాప్తిస్మము పొందెను. 13 సంవత్సరములుగా అగస్టీన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టీన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్థిల్లుచు, తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనములోను, ప్రార్థనలోను ఎదుగుచుండెను. 

 395 వ సంవత్సరములో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్ అభిషేకించబడెను. మంచి ప్రార్థనాపరుడుగా కార్యనిర్వాహకుడుగా, ప్రసంగీకుడుగా పేరు పొందెను. “ఒప్పుకోలులు”, “దేవుని పట్టణము” అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను వ్రాసెను. సంఘ సంస్కరణకును, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడెను. 

 ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది “పరిశుద్ధుడైన అగస్టీన్” అని పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితములో అనుభవించి ఇతరులకు బోధించెను. 

431 వ సంవత్సరములో తన 77వ యేట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకొనెను పరిశుద్ధుడైన ఈ అగస్టీన్! 


ప్రసంగ శాస్త్రం మెటీరియల్ కొరకు.. click here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!