హతసాక్షుల రక్తం – Bible Upamanalu Telugulo1

హతసాక్షుల రక్తం

Bible Upamanalu Telugulo1

ఆది సంఘం క్రీస్తు నిమిత్తము అనుభవించని శ్రమ అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ వారు తమ విశ్వాసమును ఎంత మాత్రమును వదులుకోలేకపోయారు. వారు దేవుని కొరకు దృఢచిత్తులై నిలుచున్నారు. హతసాక్షులుగా చనిపోయారు. చక్రవర్తుల యొక్క ఏ శాసనం వారిని క్రీస్తుకు దూరం చేయలేకపోయింది. క్రీస్తు సంఘం శాఖోపశాఖలుగా నలుదిక్కులకు విస్తరించింది. “హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం” అనేమాట అక్షరాల నెరవేరింది. 

క్రీస్తు పునరుత్థానం తరువాత కొంతకాలానికి కౄరుడైన నీరో చక్రవర్తి ఏలిన రోజులవి. అతని దగ్గర అసమానమైన బలపరాక్రమాలు కలిగిన సైనిక దళం ఒకటి ఉంది. వారు చక్రవర్తి వస్తాదులు (గ్లాడియేటర్లు)గా పేరుగాంచారు. అందంగా, కండలు తిరిగి రోమీయుల మగతనానికి ప్రతీకలుగా నిలిచారు. 

వారు క్రీడా ప్రాంగణంలోకి నడుస్తున్నప్పుడు – “మేము చక్రవర్తి యొక్క సైనికులం. ఓరాజా, మేము నీ కోసం పోరాడుతాం. జీవించినా, మరణించినా అంతా నీ మహిమ కోసమే” అంటూ పాడతారు. ఆ తరువాత వారు నీరో కోసం కుస్తీ పోటీలో పాల్గొంటారు.  Bible Upamanalu Telugulo 

నీరో చక్రవర్తి క్రైస్తవ విశ్వాసమును అణిచివేయాలని ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. మొదటిగా సైన్యంలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో, వారిని ఏరివేయాలని నీరో ప్రత్యేకంగా ఆదేశించాడు. “ఏరివేయడం” అంటే వారు పెట్టుకున్న ముద్దుపేరు. 

అంతే, సైన్యాధిపతి వేస్పేసియన్ రంగంలోకి దిగాడు. విపరీతమైన చలిలో శూరులతో పాటు దళాలన్నిటిని వరుసగా నిలబెట్టించాడు. బిగ్గరగా అతడు – “మీలో కొందరు క్రైస్తవ్యముగా పిలువబడుతున్న ఓ కొత్త మూఢనమ్మకాన్ని అంగీకరించినట్లు నా దృష్టికి వచ్చింది. ఇది నిజమేనని నేను అనుమానిస్తున్నాను. అందుకై మీరు శిక్షింపబడ్డారు. కానీ మీరు బతికి బట్ట కట్టాలంటే ముందుకు రావాలని ఆదేశిస్తున్నాను” అంటూ అరచి చెప్పాడు. 

వెంటనే నలభైమంది శూరులు ఆ దళంలోంచి ముందుకు రావడం అతణ్ణి ఆశ్చర్యపడేలా చేసింది. 

సేనాధిపతైన వేస్పేసియన్ సైనిక దళాలను పంపివేసి, క్రైస్తవ శూరులను వారి విశ్వాసం నుంచి బయటికి తేవడానికి దినమంతా ప్రయత్నించాడు. “మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీరు కోల్పోయే దాని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు క్రైస్తవ విశ్వాసాన్ని వదిలేయకపోతే దాని పర్యవసానాలు గురించి కూడా మీరు ఆలోచించండి” అంటూ బుజ్జగిస్తూ, హెచ్చరిస్తూ, బెదిరిస్తూ, అతడు చెప్పిన మాటలకు నలభైమంది శూరులలో ఏ ఒక్కడును లొంగిపోలేదు. 

ఇక తదుపరి ప్రయత్నాలు కూడా వ్యర్థమని వేస్పేసియన్ గ్రహించి సైన్యాన్ని సమావేశపరచి క్రైస్తవ్యాన్ని వదిలేయడానికి చివరి అవకాశం ఇచ్చాడు. “ఈ సైన్యంలో ఎవరైన క్రైస్తవులుంటే ముందుకు రావాలని ఆదేశిస్తున్నాను” అంటూ ఆజ్ఞాపించాడు. ఎలాంటి సంశయం లేకుండా మరల ఆ నలభైమంది శూరులు ముందుకొచ్చారు. 

అక్కడే వారిని చంపమని తన సిబ్బందికి అతడు ఆదేశించేవాడే కాని అతనికి మరొక ఆలోచన వచ్చింది. 

వారిని దిగంబరులనుగా చేసి, రక్తం గడ్డకట్టించే సరస్సుకు తీసుకుని వెళ్లి, ఆ భయంకరమైన చీకటిలో, ఆ చలికి చచ్చేలా వదిలేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆలోచన అమలు చేసాడు. 

దిగంబరులైన ఆ నలభైమంది శూరులతో – “ఒకవేళ మీకు బుద్ధివచ్చి మీ విశ్వాసాన్ని వదిలేస్తే తీరానికి నడుచుకుంటూ రండి; సరస్సు చుట్టూ వెచ్చని బట్టలు, ఆహారము, చలిమంటలూ మీకు దొరుకుతాయి” అంటూ చెప్పాడు వేస్పేసియన్.  Bible Upamanalu Telugulo 

సరస్సు చుట్టూ పహారాగా నియమించబడిన సైనికులు ఏమి జరుగుతుందో చూడడానికి రాత్రంతా చీకటిలో నిశితంగా చూస్తున్నారు. వాళ్లకు ఏమీ కనబడలేదు. ఐతే వారు అప్పుడప్పుడు – “మేము క్రీస్తురాజు నలభైమంది సైనికులం. ఓ రాజా! మేము నీ కోసం పోరాడుతాం. జీవించినా మరణించినా, అంతా నీ మహిమకోసమే” అంటూ పాడటం పహారాగా నిలబడ్డ సైనికులు విన్నారు. 

తెల్లవారు జామున దయనీయమైన ఓ ఆకారం చలిమంట వైపు నడచిరావడం వారు చూశారు. పహారాగా నిలబడ్డ సైనికులు పరుగున వెళ్లి అతణ్ణి దుప్పట్లతో కప్పారు. మంట వెచ్చదనం వైపుకు త్వరగా తీసుకువెళ్లారు. ఆ నలభైమందిలో ఈ వ్యక్తి తన విశ్వాసాన్ని వదిలేసాడు. 

అప్పుడు మరల మంచు సరస్సులోంచి ఓ పాట వినబడుతోంది. “మేము క్రీస్తు రాజు ముప్పై తొమ్మిది మంది సైనికులం. ఓ రాజా! మేము నీ కోసం పోరాడుతాం. జీవించినా, మరణించినా, అంతా నీ మహిమ కోసమే” అదీ పాట! 

విశ్వాసాన్ని వదిలేసిన ఆ ఒక్కణీ మరియు ఆ ముప్పైతొమ్మిది మంది విజేతల పాటను ఆలకించుచున్న వేస్పేసియన్ తన కవచాన్ని తీసి ప్రక్కన బెట్టి, తమ ప్రభువును ఉపేక్షించడం కంటే చావడానికే ఇష్టపడిన ముప్పై తొమ్మిది మందితో కలిసి చావడానికి ఆ నలభయ్యవ వాని స్థానంలో నిలవడానికి నడుచుకుంటూ వెళ్లాడు. 

ఆ ముప్పై తొమ్మిది మందితో పాటు వేస్సేసియన్ క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయాడు. 

బైబిలు సెలవిస్తోంది – “కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొట్టె చర్మములను మేక చర్మములను వేసికొని, దరిద్రులై యుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు” అంటూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35,36,37,38 వచనాలు తెలియజేస్తున్నాయి.   Bible Upamanalu Telugulo 

ప్రియ సోదరుడా! సోదరీ! క్రీస్తునందు నీవు కలిగియున్న విశ్వాసానికి ఎదురవుచున్న పరీక్షలలో నీవెలా స్పందిస్తున్నావు? లోకంతో రాజీ పడుచున్నావా? పాపముతో రాజీపడుతున్నావా? ఈ రోజులలో యిలాంటి పరిస్థితులలో విశ్వాసమును కాపాడుకోవడం చాలా కష్టం అంటూ సమర్ధించుకుంటున్నావా? క్రీస్తు కొరకు తెగింపు కలిగి నడువు. 

అల్పమైన విషయాలకు అలిగి సణిగి మూతి ముడుచుకుని ఉంటున్నావంటే, నీ విశ్వాస పరిమాణం ఏ మేరలో ఉందో ఒకసారి ఆలోచించుకో… 

కసితో విశ్వాసం సాగించు… 

పిశాచాలు ఎదురైనా – అదరక బెదరక 

అంతం మట్టుకు అపవాది మట్టికరిచేలా 

పోరాడుము! పౌరుషముతో ముందుకు సాగుము! 


మిషనరీ జీవిత చరిత్రల కోసం .. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!