డేవిడ్ లివింగ్ స్టన్ – David Livingstone Biography Telugu

డేవిడ్ లివింగ్ స్టన్

David Livingstone Biography Telugu

డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లోని ‘బ్లెస్లైర్’ అనే స్థలంలో 1813 మార్చి 19వ తేదీన జన్మించెను. వీరిది చాలా బీదకుటుంబం. ఈయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే ప్రభువును గూర్చి అనేక విషయములు నేర్పిరి. వాటిలో ప్రధానమైనది “యదార్థముగా ఉండుట!” ఎంత నష్టమైనను, కష్టమైనను ఫరవాలేదు కాని యథార్థముగా ఉండు అని అతని తల్లి, తండ్రి లివింగన్కు చెప్తూయుండే వారు. ఈయన చిన్న వయస్సులోనే ప్రభువుకు తన హృదయమును ఇచ్చెను. 

 డేవిడ్ 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దూది పరిశ్రమలో పని చేయటం మొదలు పెట్టెను. అనేక గంటలు కష్టపడి పనిచేసిన తరువాత పాఠశాలకు వెళ్ళివచ్చి అర్థరాత్రి వరకు చదువుచుండెడివాడు. ఇతనికి భక్తుల పుస్తకములు చదువుట అనిన చాలా యిష్టము. ఇతనివద్ద అనేక పుస్తకములుండెడివి. 

 16 సంవత్సరముల వయస్సప్పుడు చైనా దేశమునకు మిషనెరీగా వెళ్ళిన “గాటల్ఫ్” అనే వ్యక్తియొక్క చరిత్రను చదివెను. అప్పటి నుండి తను కూడా చైనా వెళ్ళి, అచ్చటి ప్రజలకు క్రీస్తును గూర్చి చెప్పవలెనని తీర్మానించుకొనెను. తొమ్మిది సంవత్సరములు కష్టపడి దూది మిల్లులో పనిచేసిన పిదప డేవిడ్ ఒక వైద్యశాలలో చేరెను. తరువాత కొంత వైద్యవిద్యను నేర్చుకొని ఆఫ్రికా దేశమునకు మిషనెరీగా వెళ్ళగోరెను. డాక్టర్ రాబర్ట్ మొఫత్ అను మిషనెరీని కలుసుకొని ఆయన ద్వారా డేవిడ్ మూడు నెలలు ప్రయాణముచేసి ఆఫ్రికాకు చేరెను. వారి భాషను నేర్చుకొనెను. పిదప క్రీస్తును గురించి ఎన్నడూ వినని ప్రజలను చేరుటకు ఆ ఆఫ్రికా అరణ్యములో అనేక మైళ్ళు ప్రయాణము చేయుచు, ఎన్నో కష్టనష్టములను ఎదుర్కొనుచు సువార్తను అందించుచుండెను. 

 డేవిడ్ ఆఫ్రికాలో 9000 మైళ్ళు ప్రయాణము చేసి, సువార్తను ప్రకటించుచు, క్రీస్తు ప్రేమను గురించి వారికి బోధించెను. ఆ కీకారణ్యములలో తాను ప్రయాణిస్తుండగా అనేక నదులను, సరస్సులను, విక్టోరియా జలపాతాన్ని కనుగొన్న కీర్తి డేవిడ్కు దక్కింది. ఒక గుంపు పెద్దను కలిసి కొనుటకై 100 మైళ్ళు ప్రయాణము చేసి వెళ్ళెను. కొంతకాలమైన తరువాత ఆ గుంపు పెద్ద యొక్క కుమార్తెకు జబ్బుచేసెను. డేవిడ్ ఆమెకు మందులిచ్చి ప్రార్థన చేయగా ఆమెకు పూర్ణ ఆరోగ్యము చేకూరి బలపడెను. ఆ విషయం ఆ పెద్దకు చాలా ఆనందము కలుగజేసెను. అప్పటినుండి క్రీస్తును గురించి లివింగ్టన్ చెప్పిన దంతయు శ్రద్ధతో వినుచుండెను. చివరికి క్రీస్తును స్వరక్షకునిగా అంగీక రించెను. అందువలన డేవిడ్ ఆ గుంపు అంతటికి వాక్యము ప్రకటించగలిగెను. 

 అనేక మంది జబ్బులు చేసినవారికి ఆయన మందులు ఇచ్చెను. కొంతమంది 100 మైళ్ళు దూరముకన్నా ఎక్కువ దూరము ప్రయాణము చేసి డేవిడ్ యొద్దకు వచ్చి మందులు తీసికొనుచుండెడివారు. మందుతోపాటు క్రీస్తు సువార్తను విని వెళ్ళుచుండెడివారు. ఆ అరణ్య మార్గములో ప్రజలకు సింహముల బెడద ఉండేది. ఒక దినమున డేవిడ్ మరియు కొందరు నడచి వెళ్తుండగా ఒక సింహము వారి మీదకు వచ్చెను. తన వద్దనుండిన తుపాకీ తీసికొని దానిని కాల్చబోయెను. అది ఆయన మీద పడెను. ఆయనతో ఉండిన వారందరు డేవిడ్ చనిపోయెనని తలంచిరి. కాని మరల తుపాకీ తీసికొని డేవిడ్ ఆ సింహమును చంపివేసెను. అయితే డేవిడ్ చేతి గూడ పట్టువదలి ఎంతో బాధపడెను. దేవుడే వారినందరిని సింహము నుండి తప్పించెను. 

 డేవిడ్ ఆఫ్రికాసేవకై బయలుదేరిన కొద్ది కాలంలోనే అచ్చట వాతావరణ పరిస్థితులు బాగోలేనందున భార్యను యింటికి పంపివేసెను. మరల 5 సంవత్సరముల తర్వాత లివింగ్స్టన్ తన భార్యను చూడగలిగెను. ఆమె అతనిని గుర్తు పట్టలేనంతగా అతని ముఖం ఎండకు పిడచకట్టి తోలువలె నల్లబడి యుండెను. చెట్టుకొమ్మలు పొడుచుకొని ఒక కన్ను పూర్తిగా కనబడకుండాపోయెను. రెండవ కన్ను బహుగా గాయపడెను. అటువంటి పరిస్థితులలో అనేక సంవత్సరముల తర్వాత అతడు తన భార్యను కలిసికొనెను గాని బహు కొద్దికాలంలోనే ఆమె చనిపోయెను. ఆమె సమాధి దగ్గర మోకరించి కన్నీటితో “నా యేసూ! నా రాజా! నా జీవితం, నా సమస్తం మరోసారి నీకు సమర్పించుకొంటున్నాను. నీ సేవ నిమిత్తం, నీ రాజ్యం నిమిత్తం తప్ప మరిదేనికి విలువనీయను” అని ప్రార్థించెను. 

 డేవిడ్ మరల ఆఫ్రికాకు వెళ్ళి రెండు సంవత్సరములు సేవ చేసెను. ఆయన దినదినం క్రీస్తును గురించి వారికి బోధించుచుండెను. కొంతకాలమునకు ఆయన యొద్దనుండి ఎటువంటి సమాచారము లేనందున ఆయన ఏ సింహము నోటనో పడి చనిపోయెనని అమెరికా ప్రజలు తలంచిరి గాని ఆయనను వెదకుటకు ఆఫ్రికాకు వచ్చిన “స్టాన్లీ” అను యౌవనస్థుడు, తీవ్రమైన జ్వరముతో బాధపడుచున్న డేవిడు అరణ్యములో కనుగొని మందులిచ్చి పరామర్శించెను. కోలుకున్న తర్వాత డేవిడ్ మరెక్కువ సేవచేసెను. గాని తిరిగి తన దేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకోలేదు. 

 డేవిడ్ ఒకరోజు మోకరించి “ప్రభువా! నీ వెక్కడికైనా నన్ను పంపు గాని నీవు నాతో రావాలి. ఏ భారమైనా నా మీద మోపు గాని నీవు నన్ను బలపరచాలి. ఏ కట్టు అయినా కట్టుగాని ఆ కట్టు నీ సేవకు, నీ హృదయానికి నన్ను దగ్గరగా లాగాలి” అని ప్రార్థించెను. 

 సువార్త అందని ఆ చీకటి ఖండములోని జనుల కొరకు డేవిడ్ 33 సంవత్సరములు పనిచేసెను. “ఈ లోక సంబంధమైన కష్టనష్టము లేమియు దేవుని సేవను విడుచునట్లుగా నిరుత్సాహ పరచనివ్వకుండా నా ప్రభువైన క్రీస్తు యేసునందు నన్ను నేను ప్రోత్సాహపరచుకొంటూ ముందుకు సాగుచుంటిని” అని లివింగ్స్టన్ చెప్పేవాడు. 

 చివరకు తన 60 వ ఏట, అనగా 1873 మే 1వ తేదీన తెల్లవారుఝామున 4 గంటలకు తన మంచము ప్రక్కన మోకరించి ప్రార్థించుచున్న డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశములోని ఆత్మల కొరకు ఆరాటముతో విజ్ఞాపన చేస్తూ తన తుది శ్వాసను విడిచెను. డేవిడ్ ప్రార్థన ఫలితంగా ఆఫ్రికాలో బానిస వ్యాపారం నిషేధించబడింది. చీకటి ఖండమని పిలువబడిన ఆఫ్రికా అనేక మిషనెరీల ద్వారా నేటికి వెలిగించబడింది. 


For More Stories….Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!