ద్వితీయోపదేశకాండము వివరణ
Deuteronomy in Telugu
ఉపోద్ఘాతము : మోషే వ్రాసిన పంచకాండములలో చివరిదైన ద్వితీయోపదేశ కాండములో బహు విశేషమైన ఉపదేశమున్నది. ద్వితీయోపదేశకాండము అంటే రెండవ ధర్మశాస్త్రము అని అర్ధం. సీనాయి కొండవద్ద మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం కాకుండ మరో ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు గాని, మొదట ఇవ్వబడినదే 38 సంవత్సరాల అరణ్య అనుభవపు వెలుగులో పునరుద్ఘాటించబడింది. ఈ మధ్య కాలములో ధర్మశాస్త్రములో చెప్పబడని కొన్ని నూతన సమస్యలు ఎదురయ్యాయి. ఆనాటి జీవిత పరిస్థితులకు తగినట్లు ధర్మశాస్త్రాన్ని అన్వయించుకోవడం లేక చేర్చడం అవసరమైంది. ప్రత్యేకంగా నొక్కివక్కాణించాల్సిన చట్టాలు కొన్ని పునరావృతం చేయబడ్డాయి, మరి విశదంగా వివరించబడ్డాయి. (ఉదా 5వ అధ్యాయంలోని 10 ఆజ్ఞల వివరణ). ద్వితీయోపదేశకాండము 1:1 లోని “మాటలు” అనే పదమును బట్టి ఈ గ్రంథానికి హెబ్రీ భాషలో “డెబారిమ్” అని నామకరణం చేసారు. ఇశ్రాయేలీయులకు ఇంతకు ముందు దేవుడిచ్చిన కొన్ని నియమ నిబంధనలు మరోసారి వివరించబడ్డాయి గనుక దీనిని గ్రీకులు “మిప్నేహత్తోరా” అనిపిలిచారు. అదే తెలుగులో ద్వితీయోపదేశకాండము అని అనువదించబడింది.
గ్రంథకర్త: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము మరియు సంఖ్యాకాండమును వ్రాసిన మోషేనే ఈ గ్రంథాన్ని వ్రాసాడు. మోషే దేవుణ్ణి ఎరిగినవాడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఆయన అతనికి తన మార్గాలను తెలియజేసాడు. (కీర్త 103:7). ఇశ్రాయేలీయులకు తనకార్యాలను తెలియజేసాడు గాని వారు ఆయనను ఎరుగలేదు. మోషే అరణ్యంలో దేవునితో పొందిన అన్యోన్య అనుభవం మరియు జ్ఞానము నుండి వెలువడిన గ్రంథమే ద్వితీయోపదేశకాండము. అయితే ద్వితీ కా 34:5- 12 మాత్రము బహుశా యెహోషువ వ్రాసి ఉండవచ్చునన్న అభిప్రాయం ఉన్నది. Deuteronomy in Telugu
సందర్భము : ఇశ్రాయేలు ప్రజల 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఐగుప్తు నుండిబయలు దేరిన వారిలో మోషే, యెహోషువ, కాలేబు తప్ప మిగిలినవారందరు అరణ్యంలో మరణించారు. వారి తరువాతి తరానికి దేవుడు చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు తెలియవు. అందువలన మోషే రెండవసారి వివరించాల్సి వచ్చింది.
ముఖ్యాంశం: ప్రేమ మరియు విధేయత. మానవులు దేవుణ్ణి ప్రేమించి ఆయనకు విధేయత చూపించాలని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో ప్రేమ అనేమాట 22 సార్లు, విధేయత అనేమాట 10 సార్లు వ్రాయబడింది. విధేయతకు ప్రేరణనిచ్చేది ప్రేమనే. అందుకే యేసు ప్రభువు “మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు.” అని అన్నాడు. విధేయత కొరకు నిజమైన ప్రేరణ ఎలా వస్తుందో 6:4,5 లో వ్రాయబడింది. దేవునికి మానవులపట్ల గల ప్రేమనే ఆయన వారిని ఏలేందుకు మరియు చట్టాలనివ్వడానికి ప్రేరణనిచ్చింది. (4:37; 7:7,8; 23:5) మానవులకు దేవుని పట్లగల ప్రేమ ఆయనకు విధేయత చూపేందుకు ప్రేరేపిస్తుంది. (6:4,5, 30:6, 16, 20; 4:40, 11:26-28; 30:8 – 200. ఇది ఆశీర్వాదాలను పొందే విధానం. మోషే దేవునికి విధేయత చూపించమని ప్రజలను వేడుకొన్నాడు. వారు ఎందుకు విధేయత చూపించాలో కూడ వివరించి చెప్పాడు.
A) ఇశ్రాయేలీయులు దేవునికి చెందినవారు (14:1).
B) దేవుడు వారిని ప్రేమించాడు (4:3).
C) దేవుడు వారిని కాపాడి వర్థిల్లజేయాలని ఆశించాడు. (4:1)
D) వారు విధేయత ద్వారా తమ కృతజ్ఞతను వెల్లడించాలి (4:7,8).
గ్రంథ విశిష్ఠత : ఈ గ్రంథం మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అతి ప్రియమైన పుస్తకం. ఆయన శోధించబడినపుడు దీనిలోని వాక్యాలనే ఉపయోగించి సాతానును జయించాడు.
మత్తయి 4:4; లూకా 4:4 ను ద్వితీ 8:3 పోల్చిచూడండి. మత్తయి 4:7; లూకా 4:12 ను ద్వితీ 6:16తో పోల్చిచూడండి. అలాగే మత్త 4:10; లూకా 4:18 ను ద్వితీ 6:13; 10:20 తో పోల్చిచూడండి. పాతనిబంధనలోని ప్రవక్తలు కూడ తరచుగా ఈ గ్రంథంలోని విషయాలను ఎత్తి చెప్పారు. క్రొత్త నిబంధనలో కూడ ఈ గ్రంథం నుండి పేర్కొనబడిన 80 వచనాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వితీయోపదేశకాండము దేవుని వాక్యాన్ని ఘనపరుస్తుంది (6:7). “ఓ ఇశ్రాయేలు వినుము. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు” (6:4) అనే మాట పాతనిబంధనలో గొప్ప సిద్ధాంతపరమైన మాట.
ఈ గ్రంథంలో మహాశ్రమలను గూర్చిన మొదటి ప్రస్తావన ఆలాగే ఉన్నది. “అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనము చేయడు; తానునీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు (4:29-31). ఆలాగే రాబోవు ప్రవక్తను గూర్చిన వాగ్ధానం ఉన్నది. “ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను వారునాతో చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అతనినోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తు అతడు వారితో చెప్పును” (18:16-18).
అంశాలవారిగా సంగ్రహ సమీక్ష :
ఈ గ్రంథంలో మోషే చెప్పిన ఉపన్యాసాలు, పాడిన కీర్తనలు, ఇశ్రాయేలుకు చెప్పిన వీడ్కోలు ఉన్నాయి. అతని ఈ ఉపదేశం అతని భూలోక పరలోక జీవితాల మధ్య గొప్ప విభజనగా ఉన్నది. నిర్గమకాండము, సంఖ్యాకాండములో పేర్కొన్న అరణ్య ప్రయాణ సంఘటనలన్నీ ఇందులో దైవిక దృక్పథంతో పునరుద్ఘాటించబడ్డాయి. ముఖ్యంగా మోషే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేసాడో, వారు వాగ్దానదేశానికి చేరాక దేవుణ్ణి ఎలా సేవించాలో జ్ఞాపకం చేస్తూ మూడు ఉపదేశాలు చేసాడు. మోషే మరణం కొరకు ప్రలాపించిన 30 రోజులతో సహా ఈ గ్రంథంలోని సంఘటనలన్నీ రెండు నెలల కాలంలోనే జరిగాయి.
మోషే మొదటి ఉపదేశం (1-4 అధ్యా) – వెనుకకుచూచుట :
మోషే తన ఈ మొదటి ఉపదేశంలో దేవుడు అంత వరకు ఇశ్రాయేలీయులను నడిపించిన విధానమును గూర్చి, వారు పాపం చేసి దేవునికి దూరమైపోయినపుడు వారిని గద్దించిన విధానాన్ని గూర్చిమాట్లాడాడు. ఈ పుస్తక ప్రారంభంలో ఇశ్రాయేలీయులు కనాను దేశపు సరిహద్దులకు సమీపంగా ఉన్నారు. అక్కడికి వారు 11 రోజులలోనే చేరుకోగలరు గాని వారికి 40 సంవత్సరాలు పట్టింది. మనకు కూడ కొన్ని పర్యాయాలు అలాగే జరుగుతుంది. వారిలాగే మనము అవిశ్వాసమును బట్టి వెనుకబడుతూ ఉంటాము. ఆత్మీయ జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోడానికి మనం అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు సిగ్గుపడాలి. దేవుడు నమ్మదగినవాడు, గనుక మనము సిద్ధపడనంతవరకు మనల్ని మరో స్థాయికి వెళ్ళనివ్వడు. మనము దేవునిపై నమ్మకముంచనప్పుడు ఆయన విఫలుడు కాడు గాని మన అపనమ్మకాన్ని బట్టి అనేక అద్భుతాలు చేయలేడు. (మత్త 13:58) ఆదికాండము 17:8 లో అనేక వందల సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించేందుకు ఇశ్రాయేలీయులు సిద్ధంగా ఉన్నారు. వారు దానిలో ప్రవేశించేందుకు పాటించాల్సిన విషయాలను దేవుడు వారితో చెప్తున్నాడు. వాటన్నింటికి ఒక్క మాటలో “విధేయత చూపించాలి” అని చెప్పవచ్చును. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రగ్రంథంలోని విధులు మరియు షరతులతోనే వాగ్ధాన దేశంలో ప్రవేశించారు. పంచగ్రంథాలలో మొదటి నాలుగింటిలో దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకొన్నాడు. ఇప్పుడు ఈ ఐదవ గ్రంథములో ఇశ్రాయేలీయులు తనను ఏర్పరచుకోవాలని లేక ఎన్నుకోవాలని చెప్తున్నాడు. అందుకే ఈ గ్రంథాన్నంతా, దేవున్ని ప్రేమించి, విధేయత చూపించాలన్న సుదీర్ఘ విన్నపముగా చెప్పుకోవచ్చును. Deuteronomy in Telugu
మోషే ఇశ్రాయేలీయులను ఒక్కసారి గతంలోనికి తీసికొని వెళ్ళి వారు అరణ్యంలో సంచరించినప్పటి సంఘటనలన్నిటిని సమీక్షిస్తున్నాడు. దేవునికి వారి పట్ల గల పితృప్రేమను బట్టి ఆయన వారిని పోషించి, సంరక్షించి, కాపాడి శ్రద్ధ వహించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి విధేయత చూపించమని బతిమిలాడుతున్నాడు. ఇశ్రాయేలు రెండవ తరం ప్రజలు తమ పితరుల అనుభవాల్ని ముందుంచుకొని వారి జీవితాలను చక్క పరుకోవాలన్నదే మోషే ఉద్దేశం.
దేవుడు చేసిన మేళ్ళను మరచిపోవడం మానవుల లక్షణం. గతంలో మనం నేర్చుకొన్న సత్యాలు, దేవుడు మనకు బలవంతంగా నేర్పించిన పాఠాలు మనం జ్ఞాపకముంచుకోవడం ఎంతైనా అవసరం. దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసికొని వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించి “మీరు కనానును స్వాధీనం చేసికొనండి. నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను అని చెప్పాడు (1:8). అయితే ఇశ్రాయేలీయులు దేవుని మాటపై పూర్తిగా నమ్మకముంచలేకపోయారు. కనానును స్వాధీనం చేసికొనడానికి నిరాకరించారు. (1:29-23). 2:1 – 3:20లో ఇశ్రాయేలీయులు రెండవ తరంవారిని దేవుడు ఏవిధంగా నడిపించాడో, వారు ఆయన శక్తిని బట్టి అనేక మంది రాజులను, రాజ్యాలను ఏ విధంగా జయించగలిగారో మోషే వారికి జ్ఞాపకం చేస్తూ, 4వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించాల్సిన అవసరతను గూర్చి బోధించాడు (4:2). మోషే వారి ముందుంచిన ప్రశ్నను ప్రత్యేకంగా గమనించాలి (4:7). జీవమున్న మనిషికి జీవమున్న దేవుడు కావాలి. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, పాపక్షమను ప్రసాదించ గలిగే దేవుడు ఒక్కడే. ఆయనే యేసు క్రీస్తు పేరిట ఈ లోకానికి తన్నుతాను ప్రత్యక్షపరచుకొన్నాడు. అలాంటి దేవుణ్ణి సేవించడంలో అన్నిటికంటె ముఖ్యమైనది హృదయం. మనసులో నిజమైన భయము, భక్తి లేకుండ పైకి కనుపరచే భక్తి దేవుని దృష్టిలో వ్యర్థం (4:9). అంతేకాదు నిజదేవుణ్ణి మరచి విగ్రహాలను ప్రతిమలను పూజిచండం ఎంత ఘోరమైన విషయమో మోషే జ్ఞాపకం చేసాడు “నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునైయున్నాడు.” అని హెచ్చరించాడు (4:24). 4:44, 45లో ఆశ్రయపురాలను గూర్చి ప్రస్తావించబడింది. ఆరు ఆశ్రయ పురాలలో యొర్దానుకు ఇవతలి వైపున మూడు అవతలివైపున మూడు ఏర్పాటు చేయబడ్డాయి.
మోషే రెండవ ఉపదేశం (పైకి చూచుట) :5-26 అధ్యా
ఈ భాగంలో 10 ఆజ్ఞల పునరుద్ఘాటన (5:7-21) నైతిక పాపము (23:17) రాజీతత్వం (7:15) మంత్రాలను గూర్చి (18:9-14) హెచ్చరించుట; కనానును వర్ణించుట (8:7,8) సీనాయి కొండపై మోషేకు దేవునితో కలిగిన వ్యక్తిగత అనుభవాన్ని పునరావృతం చేయుట, దేవుని పట్ల ప్రజల ఆర్థిక వ్యవహారాలను జ్ఞాపకం చేయుట (26 అధ్యా) వస్త్రధారణ (22:5) విడాకులు (24:1-4) స్త్రీ హక్కులు 21:10-17; 22:13 – 20) యుద్ధము – (20)ను గూర్చిన చట్టాలు మరియు ఆ తరము వారి పట్ల దేవుని ఉద్దేశం యొక్క సంగ్రహణ మొదలైన వివరాలు ఉన్నాయి. మోషే చేసిన ప్రసంగాలలో ఇది సుదీర్ఘమైనది.
ఈ ప్రసంగం ఆరంభంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను గూర్చి జ్ఞాపకం చేస్తున్నాడు (5:2,3). ఆయన ఇశ్రాయేలుతో చేసిన ఈ నిబంధన సర్వమానవ కోటికి దేవుడు ఇచ్చిన పవిత్ర గ్రంథము బైబిలుకు సాదృశ్యంగా ఉన్నది. మనము ఆయనను సమీపించడానికి దేవుని వాక్యము ఒక వారధిలాంటిది. కనుకనే మోషే ఇశ్రాయేలీయులతో దేవుని నిబంధనను జ్ఞాపకం చేసాడు. ఆ నిబంధనను బట్టే పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అంతేకాదు దేవుడు మనకిచ్చే దీవెనలు మనతోనే ఆగిపోకూడదు. మన తరువాత మన బిడ్డలకు తరతరాలుగా కొనసాగాలన్నదే దేవుని సంకల్పం (5:29). 6వ అధ్యాయమంతా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచవలసిన విధానాన్ని గూర్చి వివరిస్తుంది. దేవుని ఆజ్ఞలను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
6:4-9 భాగాన్ని హెబ్రీ భాషలో “షమా” అని పిలిచేవారు. “షమా” అనే మాటకు “వినుము” అని అర్థం. ఆ దినాలలో ఇశ్రాయేలీయుల గృహాలలో ప్రతి ఉదయము, సాయంత్రము షమాను ఒక విశ్వాస ప్రమాణముగా ఉచ్ఛరించేవారు. ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబములో కూడ దేవుని వాక్యోపదేశము ఆత్మీయ శిక్షణ ఇవ్వబడాలి. అందుకే అపొస్తలుడైన పౌలు “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫె 6:4) అని చెప్పాడు. Deuteronomy in Telugu
7వ అధ్యాయంలో వివాహ సంబంధాలను గూర్చి వ్రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకంలో దేవుని కొరకు ప్రత్యేకించబడినవారు. ఏర్పాటు చేయబడినవారు, కనుక వారు అన్యులతో ఏలాంటి నిబంధన చేసికొన కూడదని, వారితో వియ్యమందకూడదని స్పష్టం చేసాడు. వివాహం అన్నిటిలో ఘనమైనది గనుక విశ్వాసులు అన్యులతో వివాహం చేసికోకూడదని వాక్యం హెచ్చరిస్తున్నది. II కొరి 6:14.
ఇది చదువుతున్న యౌవనస్తులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక మనవి. వివాహ విషయంలో ఎటువంటి తొందరపాటు పనికిరాదు. బాహ్య అందం, ఆధిక్యతలు, సంపదలు కుటుంబ జీవితంలో సంతోషాన్ని ఇవ్వవు. కనుక ప్రతి విశ్వాసియైన యౌవన బిడ్డ, విశ్వాసియైన జీవిత భాగస్వామినే కలిగి ఉండాలన్న తీర్మానం చేసికోవాలి. అంత మాత్రమే కాదు తమ స్వంత అభీష్టాలను బట్టి కాక దేవుని చిత్తానుసారంగా జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి. విశ్వాసులు సంబంధాలు వచ్చినా, ఆ వ్యక్తిని పెళ్ళిచేసికోవడం దేవుని చిత్తమో కాదో ప్రార్ధించి తెలిసికోవాలి. దేవుడు మనం అనుదినం క్రమంగా చదువుతున్న వాక్యభాగం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతాడు. Deuteronomy in Telugu
వివాహ వయస్సు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు కూడ తమ పిల్లల విషయం ప్రార్ధించి దేవుని చిత్తాన్ని తెలిసికొని వారికి జీవిత భాగస్వాములను ఎన్నుకోవాలి తప్ప, అందచందాలు కులమతవర్గాలు, ఆస్తిపాస్తులు చూసి మరియు వరకట్నాల ఆశతో పిల్లల జీవితాలకు నష్టం వాటిల్లనివ్వకూడదు. దేవుని చిత్తానుసారంగా కట్టబడిన వైవాహిక జీవితాలు, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు దేవుని దీవెనలతో నింపబడతాయి.
8వ అధ్యాయంలో మోషే, మన జీవితాలలో దేవుని వాక్యము యొక్క ప్రాధాన్యతను గూర్చి హెచ్చరిస్తూ మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసిన విధానాన్ని వివరించాడు. ఈ అధ్యాయానికి మూల వాక్యం 3వ వచనం. “ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు.” యేసు ప్రభువును సాతాను శోధించి “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము”. అని చెప్పినప్పుడు ఆయన ద్వితీయోపదేశ కాండములోని ఈ మాటలతోనే వానిని గద్దించాడు. Deuteronomy in Telugu
మనం నేర్చుకోవలసిన మరో ప్రాముఖ్యమైన సత్యం. 8:11-18 లో ఉంది. కష్టంలో, ఆపదలో ఉన్నప్పుడు దేవుని వైపు చూడడం సహజం. కాని అన్ని విధాలా సమృద్ధి ఉన్నప్పుడు దేవునికి నమ్మకస్తులుగా జీవించడమే విశ్వాసానికి అసలైన పరీక్ష. అందుకే మోషే “మీరు కనాను దేశం స్వాధీనం చేసుకున్న తరువాత అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆ సమృద్ధిని మీకు ఇచ్చిన దేవుణ్ణి మరచిపోతారేమో జాగ్రత్త” అని ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తున్నాడు.
లేమి మరియు సమృద్ధి ఈ రెండు కూడ విశ్వాసికి పరీక్షలే. లేమిని బట్టి దేవుని ప్రేమను. ఆయనకు మన పట్ల గల ఉద్దేశాలను అపార్థం చేసికొనే ప్రమాదం లేక ఆయన మార్గాల నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాగే సమృద్ధిలో దేవుణ్ణి మరచిపోయి తననుతాను నమ్ముకొనే ప్రమాదం, లేక తన ధనాన్ని నమ్ముకొని జీవించే ప్రమాదం కూడ ఉంది. అందుకే ఆగూరు దేవునితో ఇలా మనవి చేసాడు. “దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; వ్యర్ధమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను, ఐశ్వర్యమునైను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి-యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో” (సామె 30:7-9). Deuteronomy in Telugu
9వ అధ్యాయంలో కృపను గూర్చి మరియు ఆకృపకు విధేయత చూపించాల్సిన అవసరతను గూర్చినొక్కి చెప్పబడింది (9:4,5). దేవుడు ఇశ్రాయేలును వాగ్దాన దేశానికి చేర్చాడు అంటే అది ఆయన కృపనుబట్టే గాని, ఇశ్రాయేలీయులనీతి కాదు అని మోషే 8,9 అధ్యాయాలలో నాలుగు సార్లు హెచ్చరించాడు (8:17; 9:4-6). అందుకు ప్రతిగా దేవుడు వారి నుండి ఏమి కోరుతున్నాడో 10:12,13 లో వ్రాయబడింది. మనమిచ్చే డబ్బు, మన తలాంతులు వీటన్నిటి కంటె ముందుగా దేవుడు మన నుండి కోరేది మన హృదయాన్నే. ఆయన పై భక్తి చూచేవాడు కాదని మోషే మరోసారి హెచ్చరించాడు. “ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు.” (10:17).
అంతమాత్రమే కాదు, దేవుని సేవించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సేవించాలి. పదకొండవ అధ్యాయంలోని సందేశమంతా ఇదే. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సేవించుట అంటే అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితులలో ఆయనకు సమీపంగా జీవించుట మరియు ఆయన మాటకు లోబడి జీవించుట. మనకిష్టమైనపుడు విధేయత చూపించడం, ఇష్టంలేని విషయాలలో విధేయత చూపించకపోవడం, సంపూర్ణ సమర్పణ అనిపించుకోదు. అందుచేతనే మోషే ఈ అధ్యాయాలలో “దేవుని కట్టడలను, విధులను ఎల్లప్పుడు నీవు గైకొనవలెను” అని పదే పదే ఆజ్ఞపించాడు. మనము అన్ని విషయాలలో దేవునికి లోబడినప్పుడే దీవెనలు పొందగలుగుతాము (11:26-28). దేవుడు మనల్ని బలవంతంగా లోబరచుకోడు. మనమే స్వచ్ఛందంగా, సంపూర్ణంగా ఆయన మాటకు లోబడాలని కోరుతున్నాడు.
ఆధ్మాత్మిక విధులు (12:1-16:17) : ఈ భాగంలో, ముఖ్యంగా 12,13 అధ్యాయాల్లో విగ్రహారాధన దేవుని దృష్టిలో ఎంత ఘోరమైన పాపమో మోషే జ్ఞాపకం చేసాడు (12:23) దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి తప్ప, తమ కంటికి కనిపించే ఏదో ఒక ఆకారాన్ని, రూపాన్ని సృష్టించుకొని దానిని దేవుడు అనడం దేవుణ్ణి అవమానించడమే సుమా! బైబిలు ఈ విషయాన్ని పదే పదే హెచ్చరిస్తుంది. విగ్రహారాధన ఎంత ఘోరపాపమో, దానిని ప్రోత్సహించడం కూడ అంతే ఘోరపాపం. వారికి మరణ శిక్ష విధించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అతడు ప్రవక్త అయినా సరే (13:5) భార్య లేక పిల్లలు, సోదర సోదరీమణులైనా సరే లేక స్నేహితులైనా, మరెవరైనాసరే వారిని నిర్దాక్షిణ్యంగా రాళ్ళతో కొట్టి చంపాలని ఆజ్ఞాపించాడు. (13:6-11). ఒకవేళ వారు జయించబోయే పట్టణాలవారు ఎవరైనా అలా ప్రోత్సహిస్తే ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఆజ్ఞాపించాడు (13:12 – 18).
ఇక 14-16, అధ్యాయాలలో ఆహారము, దశమభాగం చెల్లించడం, పండుగల ఆచరణను గూర్చిన ఆజ్ఞలు వ్రాయబడ్డాయి. దశమభాగం విషయం గమనించాల్సిన ముఖ్యమైన సత్యం ఏమంటే ఆస్తిలో, రాబడిలో లేక సంపాదనలో పదవ వంతు ఇవ్వడం ముఖ్యంకాదు, మొదటి పదవ వంతు ఇవ్వడం ప్రాముఖ్యం (14:22-29). దానిని బట్టి మన జీవితాల్లో దేవునికి ప్రధాన స్థానం ఇస్తున్నామని వ్యక్తపరుస్తాం. (మలా 3:8-10).
15వ అధ్యాయంలో ఒకరికొరకు ఇచ్చిపుచ్చుకొనే విషయాలను గూర్చి, పనివారిని ప్రేమతో చూడాల్సిన అవసరతను గూర్చి వ్రాయబడింది. 15:19-2 “ప్రథమ ఫలము యెహోవాదే” అని మరోసారి జ్ఞాపకం చేయబడింది. 16:1-17లో ఇశ్రాయేలీయులు పాటించాల్సిన పండుగలను గూర్చి చెప్పబడింది.
రాజకీయ, మత విధులు (16:18- 20:20) :ఈ భాగంలో ఇశ్రాయేలు ప్రజల
న్యాయ వ్యవస్థ, న్యాయాధిపతులను గూర్చి వ్రాయబడింది. న్యాయాధిపతులు దేవుని యందు భయభక్తులు కలిగి, పక్షపాతము లేకుండ న్యాయంగా తీర్పు తీర్చాలని, లంచం తీసుకొనవద్దని తీవ్ర హెచ్చరిక చేయబడింది 16:21-17:13 లో సామాజిక న్యాయాన్ని గూర్చి, 17:15,16లో రాజుకు ఉండాల్సిన లక్షణాలను గూర్చి వ్రాయబడ్డది. రాజు మొదట ఇశ్రాయేలీయుడైయుండాలి (17:15) ధనాపేక్షలేని వాడైయుండాలి (17:16) ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దానిని ధ్యానించేవాడైయుండాలి (17:14-22) నేటి క్రైస్తవ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు కూడ ఇవే. (I తిమో 3 అధ్యా). Deuteronomy in Telugu
18వ అధ్యాయం ప్రత్యేకించి లేవీయులను గూర్చిన వివరాలు అందిస్తున్నది. లేవీయులకు యెహోవాయే స్వాస్థ్యము గనుక మిగతా గోత్రాలవలె వారికి ఎలాంటి సార్ధము ఇవ్వబడదు (18:2). ఈ అధ్యాయంలో మోషే క్రీస్తును గూర్చి చెప్పిన ప్రవచనం ఉన్నది (18:17,18). దీనిని బట్టే యూదులు బాప్తిస్మమిచ్చు యోహానును “నీవు ఆ ప్రవక్తవా” అని అడిగారు (యోహా 1:21). ఇశ్రాయేలీయులు భయపడి మేము దేవుణ్ణి చూడలేము. ఆయన స్వరాన్ని వినలేము అని చెప్పిన మాటలను బట్టి దేవుడు శరీరధారిగా మానవుల మధ్యకు వస్తాడన్న వాగ్ధానం మోషే ద్వారా ఇవ్వబడింది. ఆ ప్రవక్త మాటలను విననివానికి దేవుడు తీర్పు తీరుస్తానని ప్రకటించాడు, కనుక యేసు నందు విశ్వాసముంచని వారందరికి దేవుడు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు (యోహా 3:17-19).
19వ అధ్యాయం ఆశ్రయ పురాలను గూర్చి వివరిస్తున్నది. ఈ ఆరు ఆశ్రయ పురాలు మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నాయి. పాపంచేసినవారు, క్రీస్తు ప్రభువు
బైబిల్ ప్రశ్నలు – జవాబులు కొరకు ….. Click Here