వివిధ స్వభావాలు – End times sermon message In Telugu

వివిధ స్వభావాలు.

End times sermon message In Telugu

మూలవాక్యము: నూతన హృదయం మీకిచ్చెదను ” నూతన స్వభావం”   మీకు కలుగజేసెదను.

(యెహెజ్కేలు) 36:26

26.నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

36:26 A ద్వితీ 30:6; కీర్తన 51:10; యిర్మీయా 32:39; యెహె 11:19-20; జెకర్యా 7:12; మత్తయి 13:20-21; మార్కు 4:16-17; యోహాను 3:3-5; 2 కొరింతు 3:3, 18; 5:17; గలతీ 6:15; ఎఫెసు 2:10; ప్రకటన 21:5; B మత్తయి 13:5 

1.) కయూను స్వభావం – ద్వేషం.

 (ఆదికాండము) 4:9

9.యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

4:9 A సామెత 28:13; B యోహాను 8:44; C ఆది 3:9-11; కీర్తన 9:12; 10:13-14; D యోబు 22:13-14

2.) యోసేపు అన్నల స్వభావం – అసూయ.

 (ఆదికాండము) 37:23,24,25,26,27,28

23.యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,

24.అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.

25.వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళ మును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి. 

26.అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణ మును దాచి పెట్టినందువలన ఏమి ప్రయో జనము?

27.ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోద రులు సమ్మతించిరి.

28.మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీ యులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. 

3.) నెబుకద్నెజరు స్వభావం – గర్వం.

 (దానియేలు) 4:30

30.రాజు బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.

4.) ఆకాను స్వభావం – ఆశ.

(యెహొషువ) 7:20

20.ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.

5.) సౌలు స్వభావం – అసూయ.

 (మొదటి సమూయేలు) 18:6,7,8,9,10,11,12

6.దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలో నుండి తంబురల తోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి

7.ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు-సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.

8.ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని-వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొన గలడు అనుకొనెను 

9.కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను.

10.మరునాడు దేవునియొద్ద నుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.

11.ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా-దావీదును పొడిచి గోడకు బిగించు దుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించు కొనెను.

12.యెహోవా తనను విడిచి దావీదునకు తోడై యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను.

6.) యూదా స్వభావం – వంచన.

 (యోహాను సువార్త) 13:20,21,22,23,24,25,26,27,28,29,30

20.నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

21.యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను

22.ఆయన యెవరిని గూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు చూచు కొనుచుండగా

23.ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను

24.గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.

25.అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.

26.అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;

27.వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా

28.ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు.

29.డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమనియైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.

30.వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.


 ప్రశ్నలు – జవాబులు .. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

3 thoughts on “వివిధ స్వభావాలు – End times sermon message In Telugu”

Leave a Comment

error: Content is protected !!