Good Friday Sermons In Telugu – సిలువ శక్తి1

Good Friday Sermons In Telugu

సిలువ శక్తి

మూలవాక్యము : సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెట్టితనముగాని రక్షింపబడుచున్న మనకు “దేవుని శక్తి”

 (మొదటి కొరింథీయులకు) 1:18

18.సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

1:18 A రోమ్ 1:16; 1 కొరింతు 1:21, 23-25; 2:2, 14; 2 కొరింతు 2:15-16; 4:3; 10:4; గలతీ 6:12-14; 1 తెస్స 1:5; 2 తెస్స 2:10; హీబ్రూ 4:12; B కీర్తన 110:2-3; అపొ కా 13:41; 17:18, 32; 1 కొరింతు 3:19; 15:2; C అపొ కా 2:47

1.) సిలువపైన మన పాపమును స్వీకరించువాడు.

 (యెషయా గ్రంథము) 53:5,6

5.మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

53:5 “గాయపడ్డాడు”– కీర్తన 22:16; యోహాను 19:18, 34; జెకర్యా 12:10. ఇక్కడ వాడిన హీబ్రూ పదానికి అర్థం పదునైన పరికరం వల్ల గాయాలు పొందడం. ఇక్కడ కూడా యేసు పొందిన వేదనలన్నీ మనకు బదులుగా మన స్థానంలో ఆయన అనుభవించాడని నొక్కి చెప్పడం కనిపిస్తుంది. మనం భరించవలసినదాన్ని ఆయన భరించాడు. ఆయన గాయపడడానికీ, దెబ్బలు తినడానికీ కారణం మన పాపాలే. నలగ్గొట్టడం అనే పదం లోకమంతటి పాపాల భారం ఆయన మీద పడ్డాయని సూచిస్తూ ఉంది (యోహాను 1:29; 2 కొరింతు 5:21; 1 పేతురు 2:24).

“శిక్ష”– మనకు శాంతి కలిగించే శిక్ష అంటే, మన పాపాలను తీసివేసే శిక్ష అని అర్థం. మనం దేవునితో సఖ్యపడేందుకు మార్గాన్ని తెరిచిన శిక్ష ఇది. పాపులనుండి పాపం తొలిగిపోయేంతవరకు వారికి దేవునితో సమాధానం గాని, వారిలో దేవుని శాంతి గాని ఉండవు. మన పాపాలకు న్యాయంగా చెందవలసిన శిక్షను యేసుప్రభువు భరించాడు. మన స్థానంలో దేవుడు ఆయన్ను శిక్షించాడు. మనకు దేవునితో సఖ్యత కలగడం, శాంతి చేకూరడమే ఇందులోని ఉద్దేశం (2 కొరింతు 5:18-21; ఎఫెసు 2:13-18; 1 పేతురు 3:18).

“ఆరోగ్యం”– ఇందులో క్షమాపణ ఉంది. అయితే ఇది క్షమాపణను మించినది – పాపాల విషయంలో చనిపోయి నీతిన్యాయాల విషయంలో బ్రతకడం, మంచి కాపరిదగ్గర చేరి ఆయన చూపే దారిలో జీవితం సాగించడం అని కూడా అర్థమిస్తుంది (1 పేతురు 2:24-25). చివరికి పాపరహితులుగా యేసుప్రభువులాగా లోపంలేనివారుగా మారడం జరుగుతుంది అని కూడా ఈ పదంలో ఉంది (రోమ్ 8:29; 1 కొరింతు 15:49; 2 కొరింతు 3:18; ఫిలిప్పీ 3:21; 1 యోహాను 3:2). యేసుప్రభువు గాయాలవల్లే ఇదంతా సాధ్యపడింది.

6.మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

53:6 దేవుని నుంచి దూరంగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకూ మూల పాపం. ఆదాము మొదలు మనుషులంతా ఈ పాపం చేసినవారే – ఆది 3:6 (రోమ్ 5:12); కీర్తన 58:3; 95:10; 119:67, 176; యిర్మీయా 2:13; రోమ్ 3:12; 1 పేతురు 2:25. త్రోవ తప్పిపోవడం అపరాధం అని తరువాతి వాక్యంలో రాసి ఉంది. మన అపరాధాలన్నీ, ఇలా త్రోవ తప్పిపోవడంతో సహా క్రీస్తు మీద పడ్డాయి (లేవీ 16:20, 22 పోల్చి చూడండి).

2.) సిలువపై దుఃఖాన్ని తొలగించువాడు.

 (యెషయా గ్రంథము) 53:4

4.నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

53:4 “భరించాడు”– మత్తయి 8:17లో దీని అర్థం ఇతరులను బాగుచేసే ఆయన సేవ అని తెలుస్తున్నది. అలాగైతే మన రోగాలను ఆయన బాగుచేశాడని రాసి ఉండాలి కదా. అంటే కేవలం బాగు చెయ్యడమే కాక మరింకేదో చేశాడని అర్థం కావచ్చు. వాటిని ఒక బరువులా ఆయన అనుభవించాడు. బాధపడుతున్నవారి నొప్పిని ఆయన కూడా చవి చూశాడు. మత్తయి 9:36 చూడండి. జాలి పడడమంటే బాధపడేవారి బాధను పంచుకోవడమని అర్థం. యేసు అనుభవించిన బాధలన్నీ మన ప్రతినిధిగా మనకు బదులుగా అనుభవించాడని గుర్తుంచుకుందాం. ఆయన మన స్థానంలో వాటిని భరించాడు (63:9 చూడండి. 2 కొరింతు 11:28-29లో పౌలు మాటలను పోల్చి చూడండి).

“దేవుడు…బాధించాడని”– క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ధన సమృద్ధి దేవుని అనుగ్రహానికి గుర్తు అని అనేకమంది యూదులు భావించారు. ఈ వచనాలన్నిటిని బట్టి చూస్తే క్రీస్తు పేదరికం, దుఃఖం, బాధలు దేవుడు ఆయనకు విధించిన శిక్షగా వారు అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు.

3.) సిలువపై ప్రేమను కనుపరుస్తున్నాడు.

 (రోమీయులకు) 5:8

8.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

5:8 యెషయా 53:6; యోహాను 3:16; 15:13; రోమ్ 3:5; 4:25; 5:6, 20; ఎఫెసు 1:6-8; 2:7; 1 తిమోతి 1:16; 1 పేతురు 3:18; 1 యోహాను 3:16; 4:9-10

4.) సిలువ ద్వారా మనలను అంగీకరించెను.

 (రెండవ కొరింథీయులకు) 5:21

21.ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

5:21 ఇక్కడ గొప్ప సత్యాలు నాలుగున్నాయి. ఒకటి, క్రీస్తులో ఏ పాపం లేదు (యోహాను 8:46; హీబ్రూ 4:15; 7:26; 1 పేతురు 2:22; 1 యోహాను 3:5).

రెండు, దేవుడాయన్ను పాపంగా చేశాడు – అంటే లోకమంతటి పాపాలను ఆయనపై మోపాడు. ఆ దోషాన్నీ ఆ శిక్షనూ క్రీస్తు భరించాడు. ఆయనే పాపమై ఉన్నట్టు దేవుడు పరిగణించాడు.

మూడు, ఇది “మనకోసం” (వ 14; 1 పేతురు 3:18; 1 యోహాను 4:10).

నాలుగు, ఇందులో దేవుని ఉద్దేశమేమిటంటే విశ్వాసులు క్రీస్తులో దేవుని నీతిన్యాయాలు కావాలని. ఇది వారిని నిర్దోషులుగా లెక్కించడం గురించి (రోమ్ 3:21-26 నోట్‌) చెప్తున్నది, క్రీస్తుతో ఐక్యత కలగడం గురించి (యోహాను 17:20-23; రోమ్ 6:3-8; ఎఫెసు 1:1, 4) చెప్తున్నది. దేవుని నీతిన్యాయాలు స్వయంగా క్రీస్తే (1 కొరింతు 1:30; రోమ్ 3:21-24; అపొ కా 3:14). విశ్వాసులు ఆయనతో ఐక్యత కలిగినవారు కాబట్టి ఆయనలో వారు న్యాయవంతులు, నీతిన్యాయాలయ్యారు. దేవుని ఎదుట క్రీస్తు ఏమిటో విశ్వాసులు కూడా దేవుని లెక్కకు అదే అయ్యారు.

5.) సిలువ ద్వారా వ్యాధి నుండి విముక్తి.

 (మత్తయి సువార్త) 8:17

17.ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలనఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.

8:17 యెషయా 53:4 చూడండి. ఆ భవిష్యద్వాక్కు యేసుప్రభువు వ్యాధులున్నవారిని బాగు చేసే పరిచర్య ద్వారా నెరవేరింది, సిలువపై ఆయన మరణించడం ద్వారా కాదు. అది ఆయన దయను తెలియజేస్తుంది. బాధల్లో ఉన్నవారి పట్ల ఆయన సానుభూతినీ, వారి వ్యాధులను పారద్రోలడంలో ఆయన కనపరచిన శక్తినీ తెలియజేస్తున్నది.

6.) సిలువ ద్వారా శాపము నుండి విడుదల.

 (గలతీయులకు) 3:14

14.ఇందును గూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

3:14 తన బాధల్లో ఆయన మన దీవెనల గురించి ఆలోచించాడు. ఆయనకు తాను శిక్షనుంచీ సిలువ మరణం నుంచీ తప్పించుకోవాలన్న కోరిక కంటే మనకు మేలు జరగాలన్న కోరికే ఎక్కువ తీవ్రంగా ఉండేది. ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులంతా ధర్మశాస్త్రం శాపం నుంచి విముక్తులయ్యారు (రోమ్ 8:1). దేవుడు అబ్రాహాము ద్వారా వాగ్దానం చేసిన దీవెనలకు వారసులయ్యారు (వ 8,9).

“ఆత్మను గురించిన వాగ్దానం”– లూకా 24:49; యోహాను 14:16-17; అపొ కా 1:4-5; 2:39. ఇక్కడి ఉపదేశాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చే ఈ దీవెనలు రావడం దేవుని ఆత్మను పొందినవారికే. దేవుని ఆత్మను మనం నమ్మకం ద్వారా పొందుతాము (వ 2,5; లూకా 11:13; ఎఫెసు 1:13). ఇదంతా వేరెవరివల్లా, దేనివల్లా కాదు, “క్రీస్తు యేసు” వల్లే జరిగేది.

7.) పిలువ ద్వారా క్షమాపణ దొరుకును.

 (కొలొస్సయులకు) 1:13,14

13.ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క(మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.

1:13 ఇక్కడ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం అయిన రెండు రాజ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతి వ్యక్తీ ఈ రెంటిలో ఏదో ఒక దాన్లో ఉన్నాడు.

14.ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.

8.) సిలువ ద్వారా తీర్పు నుండి విడుదల.

 (హెబ్రీయులకు) 9:26,27

26.అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.

9:26 “ఒకే సారి”– వ 12,28; 10:10, 14. సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందు క్రీస్తు చేసిన ఒక్క బలి అర్పణ మనుషుల క్షమాపణకు సరిపోతుంది. ఆయన తనను అర్పించుకుని లోక పాపాలన్నిటినీ తీసివేశాడు (యోహాను 1:29). ఈ అర్పణను తిరిగి చేయడం అనవసరం, అలా ఆలోచించడానికి కూడా తగనిది.

27.మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. 

Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu Good Friday Sermons In Telugu


బైబిల్ ప్రశ్నలు – సమాధానాలు .. click here 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!