అంశం: విశ్వాసులు అన్యులను వివాహమాడితే.
Is It Biblical to Marry an Unbeliever Telugu
1.) అహాబు ఇశ్రాయేలీయుడు – యెజెబెలు అన్యురాలు.
(మొదటి రాజులు) 16:30
30.ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
16:30 యరొబాం దుర్మార్గుడు. ఒమ్రీ అంతకన్నా దుర్మార్గుడు. వీరిద్దరికంటే అహాబు పరమ దుర్మార్గుడు. తన ప్రజలపై ఇలాంటి వారిని దేవుడెందుకు పరిపాలన చేయనిచ్చాడు? ఆ ప్రజల ప్రవర్తన ప్రకారం వారికి తగిన రాజులనే వారిపై నియమించడం న్యాయమే.
16:30 A 1 రాజులు 16:25; B 1 రాజులు 14:9; C 1 రాజులు 21:25; 2 రాజులు 3:2; D 1 రాజులు 16:31, 33
2.) నయోమి కొడుకులు దేవుని బిడ్డలు – కోడళ్ళు అన్యులు.
(రూతు) 1:4
4.వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు.
3.) సంసోను దేవుని బిడ్డ – దెలీలా ఫిలిష్తీయుల కుమార్తె.
(న్యాయాధిపతులు) 14:1,2,3
1.సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను.
2.అతడు తిరిగి వచ్చితిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా
3.వారునీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.
4.) సొలొమోను దేవుని బడ్డ – ఫరో కుమార్తె ఐగుప్తీయురాలు.
(మొదటి రాజులు) 3:1
1.తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.
3:1 A 1 రాజులు 9:24; B 2 సమూ 5:7; C 1 రాజులు 6:1—7:15; 9:15-19; 11:1; 1 దిన 11:7; 2 దిన 2:1-4; 8:11; 18:1; ఎజ్రా 5:11; 9:14
5.) విశ్వాసికి – అవిశ్వాసికి సంబంధం (సహవాసం) లేదు.
(రెండవ కొరింథీయులకు) 6:14,15,16,17,18
14.మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
6:14-18 ఈ ముఖ్యమైన సత్యాన్ని పౌలు ఇక్కడ విశదపరుస్తున్నాడు: క్రీస్తులోని విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజ. దానికి తగినట్టుగానే వారు నడుచుకోవాలి. ద్వితీ 7:3-6; 1 పేతురు 2:9-12; యోహాను 17:6-10, 17-19. వ 14లో అన్ని కాలాల్లో అన్ని చోట్లా అందరు విశ్వాసులకూ వర్తించే సూత్రాన్ని పౌలు తెలుపుతున్నాడు. అవిశ్వాసులతో వారెలాంటి దగ్గర సంబంధమూ పెట్టుకోరాదు. “జతగా” ఉండడమంటే ఒకే ఉద్దేశంతో కలిసి ఒక పనిలో పాల్గొనడం. ద్వితీ 22:10 చూడండి. విశ్వాసులు క్రీస్తుతో జతపడ్డారు (మత్తయి 11:28-29). కాబట్టి క్రీస్తును తిరస్కరించిన వారితో జత కట్టకూడదు. విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్య వివాహాన్ని ఇది ఖచ్చితంగా నిషేధిస్తున్నది (1 కొరింతు 7:39; ఎజ్రా 9:1-2; నెహెమ్యా 13:23-27; మలాకీ 2:12 కూడా చూడండి). అబద్ధమైన శుభవార్తను బోధించేవారితో, బైబిల్లోని ఏదో ఒక మూల సత్యాన్ని కాదనే దుర్బోధకులతో సహవాసాన్ని కూడా ఇది నిషేధిస్తున్నది. అవిశ్వాసులు పని చేస్తున్న చోట విశ్వాసులు పని చేయకూడదని పౌలు అనడం లేదు, లేక తమ పని చేసేందుకు అవిశ్వాసులను జీతానికి పెట్టుకోవద్దనడం లేదు. అవిశ్వాసులతో ఎలాంటి సంబంధం లేకుండా దూరంగా ఉండాలని దీని అర్థం కాదు (1 కొరింతు 5:9-10). అవిశ్వాసులను క్రీస్తుదగ్గరికి నడిపించాలని పౌలు స్వయంగా వారితో కలిసిమెలిసి ఉన్నాడు (1 కొరింతు 9:19-23). కానీ ఇక్కడ వారితో దగ్గర సంబంధం, ఒకటే గమ్యం ఉండకూడదనీ, బైబిలు సూత్రాల విషయంలో రాజీపడేలా చేసే సంబంధం, క్రీస్తుతో వారి సహవాసాన్ని చెరపగల ఎలాంటి సంబంధం వారితో ఉండకూడదనీ చెప్తున్నాడు. ఈ నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ విశ్వాసి అయినా కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు.
14-16 వచనాల్లో విశ్వాసులు అవిశ్వాసులతో కలవడం ఎంత పొరపాటో, ఎంత తెలివితక్కువతనమో చూపించే ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎక్కడా పొంతన లేని విషయాలను గానీ వ్యక్తులను గానీ ఒకటిగా చూడకూడదు. దుర్మార్గమంతటి నుంచీ, దుర్మార్గులందరినుంచీ వేరుపడడమన్నది తన ప్రజలకు దేవుని ఆదేశం.
15.క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
16.దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.
17.కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
18.మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
6.) ఎద్దును గాడిదను జత చేయకూడదు.
(ద్వితీయోపదేశకాండము) 22:10
10.ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.
ప్రసంగ శాస్త్రం .. click here






👍