John Nocks Life Story In Telugu – జాన్ నాక్స్ జీవిత చరిత్ర

జాన్ నాక్స్

John Nocks Life Story In Telugu

జాన్ నాక్స్ స్కాట్లాండ్లోని గిఫోర్డ్ గేట్ నందు 1513 వ సంవత్సరములో జన్మించెను. ఈయన తల్లిదండ్రులు ఇద్దరూ కేథలిక్కులు. వీరు తెలివైనవారు మరియు ధనికులు. 

 జాన్ నాక్స్ లాటిన్ మరియు గ్రీకు చదివెను. గ్లాస్గోలోని విశ్వ విద్యాలయ ములో 8 సంవత్సరములు చదివి M.A. డిగ్రీని సంపాదించెను. చదువు పూర్తికాగానే తత్త్వశాస్త్రమును బోధించు ఉపాధ్యాయుడుగా అదే కళాశాలలో పనిచేసెను. జాన్ నాక్స్ తన 25 వ సంవత్సరములో దేవుని సేవకు యాజకుడుగా నియమింపబడెను. 

 ఈ క్రొత్త పదవిలో ఇతడు స్కాట్లాండ్లోని రోమన్ సంఘము ఎంతగా పాడయ్యెనో చూడగలిగెను. బైబిలును ఎక్కువగా చదువుచుండెను. ఇట్లు 7 సంవత్సరములు గడిపెను. ఇతడు సంఘము యొక్క స్థితిని గుర్తించి, దానిలోని తప్పులను ఖండించవలెనని ఆశించెను గాని, అట్లు చేసిన తాను మరణమునకు గురి కాగలనని గ్రహించి ఆ సంఘమును వదలిపెట్టెను. ఎక్కువ సమయం బైబిలు . చదువుట యందును, ప్రార్థించుట యందును గడిపెను.  జాన్నాక్స్ ప్రభుని చిత్తము కొరకై ప్రార్థించు చుండెను. ఆ దినములలో జార్జి అను ఒక ప్రసంగీకుడు రోమన్ కేథలిక్ సంఘము యొక్క దుష్టత్వమును గూర్చి ఖండించుచుండెను. జాన్నాక్స్ అతనియొద్ద చేరి మరి అనేక సువార్త సత్యములను నేర్చుకొనుచుండెను. జాన్నాక్స్ సేవకునిగాను, సహాయకునిగాను జార్జికి తోడ్పడుచుండెను. అనేకసార్లు జార్జితో పాటు వెంట వెళ్ళెడివాడు. ఒకసారి జార్జిని పట్టుకొని కాల్చివేయుటకు తీసుకొనిపోయి చంపివేసిరి. ఆలాగు జార్జి క్రీస్తు కొరకు హతసాక్షి ఆయెను. జాన్నాక్స్ను కూడా పట్టుకొనవలెనని ప్రయత్నించుచుండగా అతడు ఒక స్థలమునుండి మరియొక స్థలమునకు మారుచు చివరికి జర్మనీకి వెళ్ళవలెనని ఆశించెను గాని, అతని స్నేహితులు అక్కడే ఒక భవనములో ఉండమని కోరిరి. 1547 వ సంవత్సరములో తనతో కొందరిని తీసుకువెళ్ళి ఆ భవనంలో ఉండెను. అక్కడ కొన్ని కుటుంబముల వారికి చదువు చెప్పెడివాడు. అయితే తనను వెదకుచున్నారని తెలిసికొని ఆ భవనంలో ఉండుట శ్రేయస్కరం కాదని తన స్నేహితునితోపాటు సెయింట్ ఆండ్రూ అను స్థలమునకు వెళ్ళెను. అక్కడ కొద్ది రోజులలోనే అనేకులు వచ్చి ఆయన చెప్పెడివి వినెడివారు. వారికి జాన్నాక్స్ దేవుని వాక్యం బోధించెడివాడు. అంతే గాక ఆ ప్రజలకు స్కాట్లాండ్లోని భక్తి హీనతను గురించి, దేవునియొక్క పరిశుద్ధతను గూర్చి బోధించెడివాడు. 

 అంతవరకు బహిరంగంగా ప్రసంగించుటకు భయపడెడి జాన్నాక్స్ 30 సంవత్సరముల వయస్సులోకి రాగానే ధైర్యంగల ప్రసంగీకునిగా మారెను. కాని ఆయన ఎప్పుడూ మంచి ప్రసంగములు చేయుటకు ప్రయత్నించలేదు. అయితే “నేను దేవుని దగ్గరనుండి వచ్చిన ప్రవక్తను, నా దగ్గరనుండి తియ్యని మాటలు రావు. కఠినమైన మాటలే వచ్చును” అని అనెడివాడు. దేశములో హింసలు ఉండినప్పటికి నాక్స్ ఆ ప్రజలకు వారి దుష్టత్వమును గురించి, వారి పాపమును గురించి ఖండిస్తూ బోధించెడివాడు. దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చునని హెచ్చరించెడివాడు. పశ్చాత్తాపపడి ప్రభువు దగ్గరకు రమ్మని బ్రతిమాలెడివాడు. 

 చివరకు స్కాట్లాండ్ దేశపు రాణి కూడా జాన్నాక్స్ బోధలకు కదిలించబడినను; పశ్చాత్తాపపడక నాక్స్ను, అతని అనుచరులను ఓడ ఎక్కించి ఫ్రాన్స్ దేశమునకు బహిష్కరించెను. అక్కడ నాకున్న సంకెళ్ళతో బంధించి జైలులో వేసిరి. అయినను జాన్నాక్స్ ఏ నరునికి భయపడకూడదని తీర్మానించుకొనెను. 

 మరియకు మ్రొక్కరాదనియు, విగ్రహారాధన తప్పనియు బోధించిన నాక్స్ దగ్గరకు రంగులు వేసిన ఒక విగ్రహమును తెచ్చి దానిని ముద్దు పెట్టుకొనమనిరి. కాని అట్లు చేయుటకు అతడు నిరాకరించి, ఆ విగ్రహమును సముద్రములోనికి నెట్టివేసెను. 12 నెలల తర్వాత ఆ ఓడ యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది మరల స్కాట్లాండ్కు వెళ్లుట మంచిది కాదని తెలుసుకొని ఇంగ్లాండుకు వాక్యమందించు ఆధిక్యత దొరికెను. 1551 వ సంవత్సరమునకు జాన్నాక్స్ వెళ్ళెను. అచ్చట బహు జనులు గలిగిన ఆంగ్ల సంఘములో, అతనికి దేవుని ఆరు సంఘములను చూచుకొనెడివాడు. తన 40 సంవత్సరముల వయస్సులో ఇతడు “మారోరీ” అను నామెను పెండ్లి చేసికొనెను. జాన్నాక్స్, రాజైన ఎడ్వర్డ్ IV కోర్టులో (రాజమందిరం) కూడా ప్రసంగించెడివాడు. ఎడ్వర్లు కూడా యితనికి స్నేహితుడయ్యెను. ఇతని నమ్మకత్వమును చూచి ఇతనికి ఇంగ్లాండులో మంచి నాయకత్వమును, సువార్తకు స్వేచ్ఛను కలిగించెను. కాని, 1553 వ సంవత్సరము జూలై మాసంలో యౌవనస్థు డైన ఎడ్వర్డు రాజు మరణించెను. తర్వాత “మేరీట్రాడర్” అనే ఆమె రాణి ఆయెను. ఆమె రాణి అయిన తరువాత జాన్నాక్సును నిర్లక్ష్యపెట్టి; అతనిని, క్రైస్తవులను హింసించడం మొదలు పెట్టెను. నాక్సు జీతమును కూడా తగ్గించివేసెను. ఆ హింసలలో ఇతని స్నేహితులలో కొందరు హతసాక్షులైరి. 

 తర్వాత స్కాట్లాండ్ వెళ్లెను. జాన్నాక్స్ తన దేశములోని ప్రజలలో మార్పును, వాక్యానుసారముగా జీవించుటను చూచి, ప్రభువును స్తుతించి, స్వేచ్ఛగా దేవుని వాక్యమును బోధించుటకు ఆరంభించెను. ఒకసారి జాన్నాక్స్ ప్రసంగించు చుండగా రాణియైన మేరీ, కొంతమంది స్కాట్లాండ్ బిషప్పులు కూడా వినిరి. కాని దేవుని ఆత్మ శక్తితో బోధించు ఆ బోధకు అడ్డు చెప్పలేకపోయిరి. తరువాత జాన్ గొప్ప జన సమూహములకు దేవుని వాక్యమును బోధించెను. 

 1560 లో జాన్నాక్స్ భార్య మార్టోరీ మరణించెను. జాన్నాక్స్ ఇద్దరు కుమారులు కూడా చిన్నతనములోనే మరణించిరి. జాన్నాక్స్ జీవితములో సమస్య తరువాత సమస్య, విచారము వెంట విచారము మరనేక కష్టములు ఎదురాయెను. కాని ఇతడు నిరుత్సాహపడక తాను చేయవలసిన దేవుని పనినే చేయుచున్నందులకు సంతోషించెను. 

 జాన్నాక్స్ మరల వివాహము చేసుకొనెను. 1570 వ సంవత్సరములో ఇతడు నడువలేని, వ్రాయలేని స్థితిలో ఉండెను. అందరూ ఇక జాన్నాక్స్ మరణించునని తలంచిరి. కాని ప్రభువు అతనికి నూతన బలమిచ్చి రెండు సంవత్సరములు ప్రసంగించుటకు కృపనిచ్చెను. 1572 వ సంవత్సరము నవంబరు నెలలో మరల జబ్బు పడి బహు బలహీనుడాయెను. ఇతడు మరణించే రోజున భార్యచే చాలా సేపు బైబిలు చదివించుకొని వినెను. చివరకు తన 60వ యేట 1572 నవంబరు 24వ తేదీ రాత్రి 11 గంటలకు వారు ప్రార్థించుటకు మోకరించగా జాన్నాక్స్ బహు శాంతి సమాధానములతో అతడు ప్రేమించి, సేవ చేసిన ప్రభువుతో ఉండుటకు వెళ్ళిపోయెను. 


మరిన్ని మిషనరీ జీవిత చరిత్రల కోసం…. Click Here

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!