అంశం : పరిశుద్ధత
Sevakula Prasangaalu Telugulo 1
మూలవాక్యము : నేను పరిశుద్ధుడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.
(మొదటి పేతురు) 1:14
14.నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.
1:14 “విధేయతగల పిల్లలై”– వ 2. దేవుడు కోరేది ఇదే – రోమ్ 6:17-18; 2 కొరింతు 2:9; 2 తెస్స 2:8.
“అజ్ఞాన దశ”– యోహాను 15:21; అపొ కా 3:17; 17:30; 1 కొరింతు 15:34; ఎఫెసు 4:18; 1 తిమోతి 1:13.
“దురాశలు”– మత్తయి 15:19; రోమ్ 1:24; 8:5; ఎఫెసు 2:1-3; ఆది 8:21.
1.) మనలో దేవునికి పరిశుద్ధ స్థలము కావాలి.
(నిర్గమకాండము) 25:8
8.నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
25:8 “నేను వారిమధ్య నివసించేలా”– ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తున్నది – మనుషులతో నివాసం చేయాలన్న దేవుని పరమ అభిలాష. దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వారితో కలిసిమెలిసి ఉండడం, మనుషులు దేవుణ్ణి చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఓ మార్గాన్ని తయారు చేయడం – ఈ విషయాలను బైబిలు వెల్లడి చేస్తున్నది. బైబిలులోని సారాంశం ఇదే అనవచ్చు – ఆది 2:8, 19; 3:8; 16:7; 18:1; 32:24; నిర్గమ 3:8; 13:21; 19:20; 29:45-46; 33:14; 40:34-35; లేవీ 9:3-6; 26:11-12; సంఖ్యా 5:3; ద్వితీ 12:11; 1 రాజులు 6:13; కీర్తన 132:13-14; యెషయా 7:14; 57:15; యెహె 37:27; 48:35; జెకర్యా 2:10; మత్తయి 1:21-23; యోహాను 1:1, 14; 14:16-18, 23; అపొ కా 2:1-4; 2 కొరింతు 6:16; ఎఫెసు 2:21-22; ప్రకటన 21:3. పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం చేసేందుకు ఉన్న ఒకే ఆటంకం పాపం (యెషయా 59:1-2. ఆది 3:24 నోట్). ఇక్కడ దేవుడు తన పవిత్ర ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు, మనుషులు దాన్ని మీరుతారని ఆయనకు తెలుసు. తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గాన్ని ఏర్పరచాడు. తద్వారా తాను వారి మధ్య నివసించడానికి వీలు కలగాలని దేవుని ఉద్దేశం. అది పవిత్రత, బలి అర్పణల మార్గం.
2.ఏడవదినము మీకు పరిశుద్ధము.
(నిర్గమకాండము) 35:2
2.ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.
35:2 A నిర్గమ 20:9-10; 34:21; లేవీ 23:3; సంఖ్యా 15:32-36; లూకా 13:14-15; B నిర్గమ 23:12; 31:13-16; హీబ్రూ 10:28-29; C ద్వితీ 5:12-15; యోహాను 5:16; హీబ్రూ 2:2-3
3.) దేవుని ఆజ్ఞ.
(లేవీయకాండము) 19:2
2.మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.
4.) మందిరము పరిశుద్ధ స్థలము.
(మొదటి దినవృత్తాంతములు) 29:16
16.మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.
5.) ఆయన నామము పరిశుద్ధము.
(మత్తయి సువార్త) 6:9
9.కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
6:9 క్రీస్తు శిష్యులు ఎక్కువగా ఆశించవలసిన విషయాలు ఈ క్రింది ప్రార్థనలో ఉన్నాయి. ఎంత గొప్ప సత్యాలు ఎన్ని ముఖ్య విన్నపాలు సామాన్యమైన భాషలో, కొద్ది మాటల్లో పెట్టవచ్చునో గమనించండి. దేవుని ప్రజలు ప్రార్థన చేసే విషయాలన్నీ ఇక్కడ లేవు గానీ అన్ని వేళలా వారి మనస్సులో ఉండవలసినవి మాత్రం ఈ ప్రార్థనలో ఉన్నాయి. వారు ఎలా ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అన్న విషయాలను తెలిపే నమూనా, లేక ఉదాహరణ, లేక మాదిరి ప్రార్థన ఇది. ఇక్కడ చెప్పినవి గాక అనేక విషయాలు మనం ప్రార్థనలో అడగవచ్చు. అయితే ఈ ప్రార్థనలోని విషయాలను అడగవలసిన అవసరం ఇక లేదనీ మన ఆధ్యాత్మిక స్థితి దీన్ని మించిపోయిందనీ మాత్రం ఎన్నడూ భావించకూడదు.
6.) ఆయన నిబంధన పరిశుద్ధమైనది.
(లూకా సువార్త) 1:73
73.ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
7.) ఆయన లేఖనములు పరిశుద్ధమైనవి.
(రోమీయులకు) 1:4
4.దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానముచేసెను.
1:4 క్రీస్తు శుభవార్త పూర్తిగా కొత్తదేమీ కాదు. పాత ఒడంబడిక గ్రంథంలో (“పవిత్ర లేఖనాల్లో”) ఆ శుభవార్త గురించిన వాగ్దానాలూ, భవిష్యద్వాక్కులు, నీడలు, సాదృశ్యాలు ఉన్నాయి. లూకా 24:25-27, 46, 47; మత్తయి 5:17; హీబ్రూ 8:5; 10:1 చూడండి.
మనము దేని ద్వారా పరిశుద్ధపరచబడగలం?
1.) రక్తము వలన.
(మొదటి యోహాను) 1:7
7.అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
1:7 వెలుగులో నడుస్తూ ఉండడమంటే ఏమిటి? తన ఈ లేఖలో యోహాను దీనికి అర్థం చెప్తున్నాడు. పాపాంధకారంలో, అజ్ఞానంలో, తప్పులో నడవడానికి ఇది వ్యతిరేకం. అంటే పాపాన్ని, దేవుని వాక్కుకు వ్యతిరేకం అయిన ప్రతిదాన్నీ నిరాకరించి, ఆయన వాక్కు మనకు చెప్పినదాన్ని ఆచరణలో పెట్టడమే. దేవునికి సుముఖంగా ఉంటూ, మనం ఏమిటో, మనం చేసినదేమిటో ఏదీ దాచకుండా ఉండడమే. వెలుగులో నడవాలంటే ముందు మనకు వెలుగు కావాలి. అందులోకి మనల్ని తెచ్చే పని దేవునిదే – 1 పేతురు 2:9; కొలస్సయి 1:12-13. వెలుగు రాజ్యంలో ఉన్న మనకు ఆ విధంగా నడుచుకోవలసిన బాధ్యత ఉంది (2:6).
2.) వాక్యము వలన.
(కీర్తనల గ్రంథము) 119:9
9.(బేత్) యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?
119:9 ఒక యువకుడు అడగతగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. అతడికి ఉండవలసిన ఉన్నతమైన ఆశయాల్లో ఒకటి. దీనికి జవాబు ఇందులోనూ తరువాతి వచనాల్లోనూ కనిపిస్తున్నది. జీవిత శుద్ధి ఎలా సాధ్యమంటే అది దేవుని వాక్కును అభ్యాసం చేయడం వల్ల (వ 9), అలా చేసేందుకు దేవుని కృపనూ బలాన్నీ వెదుకుతూ ఉండడం వల్ల (వ 10), ఆలోచనలకూ ఆశలకూ దేవుని వాక్కునే కేంద్రంగా చేసుకోవడం వల్ల (వ 11), దేవుని సహాయం మూలంగా ఆయన వాక్కుకు అర్థం నేర్చుకుంటూ (వ 12) నేర్చుకున్న తరువాత ఆ వాక్కును గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల (వ 13), అందులో ఆనందిస్తూ, దాన్నే ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండడం వల్ల (వ 14-16) కలుగుతుంది.
3.) ఆత్మ వలన.
(మొదటి పేతురు) 1:2
2.ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
పరిశుద్ధత ఎందుకు అవసరం?
1.) ఆయనను చూచుటకు.
(హెబ్రీయులకు) 12:4
4.మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.
12:4 విశ్వాసి జీవితం పరుగు పందెం వంటిది మాత్రమే కాదు. అదొక యుద్ధ రంగం (ఎఫెసు 6:10-18; 2 తిమోతి 2:3; 4:7). పాపమే విశ్వాసికి శత్రువు. విశ్వాసి బయటనుంచి, లోపలనుంచి కూడా అది అతనితో పోరాడుతుంది (1 పేతురు 2:11; 1 యోహాను 1:8; రోమ్ 7:17-18). దానితో పోరు చాలించుకోవడం గొప్ప విపత్తుకు దారి తీస్తుంది.
బైబిల్ ప్రశ్నలు – జవాబుల కోసం.. click here





