సిలువలో మరణించిన యేసు.
Siluva Sevakula Prasangaalu Telugu
(ఫిలిప్పీయులకు) 2:8
8.మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
“సిలువ”– సిలువ మరణం పొందడానికి కూడా అని పౌలు అంటున్నది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయేందుకు ఉన్న విధానాల్లో అతి అవమానవకరమైన విధానం సిలువ మరణం. రోమ్‌వారు నేరస్థులకు బహిరంగంగా మరణ శిక్ష అమలు జరిపే విధానమే సిలువ.
ప్రభువైన యేసుక్రీస్తు మానవుల రక్షణార్ధమై పరలోకమును విడిచి పాపభూయిష్టమైన ఈ లోకమునకు వచ్చి ఒక నేరస్తునిగా సిలువలో మరణించుటకు తననుతాను అప్పగించుకున్నాడు. క్రీస్తు జీవించిన కాలంలో సిలువపై మరణించడంకన్నా నీచమైనది మరొకటి లేదు. అది నీచమైన నేరస్తులకు మాత్రమే రోమనులు సిలువ వేసేవారు. అయినప్పటికిని ఆయన “క్రీస్తు” అత్యున్నతమైన స్థానమునుండి దిగివచ్చి “మనకోసము” నీచాతి నీచమైన కార్యము అనుభవించాడు. వాక్యం చెప్పినట్లుగా “ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమును వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.”
(రెండవ కొరింథీయులకు) 8:9
9.మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
“దరిద్రుడు అయ్యాడు”– లూకా 2:7; మత్తయి 8:20; 17:27; 27:46; ఫిలిప్పీ 2:6-8; యెషయా 53:2-6. ఇది “మీ కోసం”, విశ్వాసులందరి కోసమూ, క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం తనను తాను అర్పించుకున్నాడు – యోహాను 10:11-18; గలతీ 2:20.
మనం ధనవంతులం కావాలని కోరాడు. దీని అర్థం ఏమిటో ఈ రిఫరెన్సులు స్పష్టం చేస్తున్నాయి – మత్తయి 19:28-29; యోహాను 14:2-3; రోమ్ 8:17; 1 కొరింతు 3:21-23; ఎఫెసు 1:3,7,8; 1 పేతురు 1:4; ప్రకటన 21:7. ఆయన దరిద్రం మూలంగానే ఇది సాధ్యం అయింది – అంటే పాపుల స్థానంలో మరణించేందుకు క్రీస్తు తనకున్నదానంతటినీ వదులుకోకపోతే ఎవరికీ పాపవిముక్తి, రక్షణ అనే ఐశ్వర్యం దక్కేది కాదు.
క్రీస్తురాయబారులు ఆయన ఆదర్శాన్ని అనుసరించారు – 6:10; అపొ కా 3:6; మత్తయి 19:27. మన సంగతేమిటి?
క్రీస్తు మరణించెను.
1.) బలహీనుల కొరకు.
(రోమీయులకు) 5:6
6.ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.
5:6-8 మనం విశ్వాసులం కాకముందు స్థితిని వర్ణించేందుకు పౌలు మూడు మాటలను వాడుతున్నాడు – “బలం లేని స్థితిలో”, “భక్తిహీనులు”, “పాపులు”. వ 10లో మరొకటి దీనికి కలుపుతున్నాడు – “విరోధులు”. వేరే మాటల్లో చెప్పాలంటే సహజంగా మనం చెడ్డవాళ్ళం (3:23; ఆది 8:21; యిర్మీయా 17:9; మత్తయి 7:11). మనకు ఏకైక నిజ దేవుడు లేడు. ఆయనకన్నా మన పాపాలే మనకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన్ను మనం కోరలేదు. అందువల్ల మనం ఆయనకు శత్రువులం. ఎందుకంటే పాపమంతా ఆయనకు విరోధమే (కీర్తన 51:5). దేవునికి వ్యతిరేకమైనదాని పక్షంగా ఉండడం ఆయనకు శత్రువులుగా ఉండడమే (యాకోబు 4:4). అంతేకాకుండా మనల్ని మనం మంచివారుగా చేసుకునేందుకూ, పాపం చేయడం మానుకునేందుకూ, దేవుని స్నేహితులయ్యేందుకూ మనకు శక్తి లేకపోయింది. ఇవి మనకు కష్టమైన సంగతులు మాత్రమే కాదు, అసాధ్యాలు కూడా.
కొన్నిసార్లు మనుషులు ఉపదేశించే ముక్తి మార్గాలు, మన దేశంలో విశేష ప్రఖ్యాతి పొందిన మార్గాలు – అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం ఎంత అసాధ్యమో దీన్నిబట్టి మనం గ్రహించవచ్చు.
అయితే మనం చేయలేనిదాన్ని దేవుడు చేశాడు. క్రీస్తు వచ్చి మన స్థానంలో మరణించి మన పాపాలను తొలగించివేశాడు. మనం ఆయన్ను నమ్మినప్పుడు క్రీస్తు రక్తం మూలంగా (వ 9) మనలను నిర్దోషులుగా లెక్కించాడు; మనలను తన స్నేహితులుగా చేసుకున్నాడు (వ 10); మన అనుభవాన్ని దృక్పథాన్ని మొత్తంగా మార్చేశాడు (వ 1-4); తన ఆత్మను మనలో ఉంచి మనల్ని నూతన సృష్టిగా చేశాడు (వ 5).
2.) పాపుల కొరకు,
(రోమీయులకు) 5:8
8.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
3.) శత్రువులైన వారికొరకు.
(రోమీయులకు) 5:8
8.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
4.) హింసించే వారికొరకు.
(మొదటి తిమోతికి) 1:13
13.నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
“తెలియక, అవిశ్వాసంలో”– అపొ కా 26:9; 23:1 చూడండి. క్రీస్తు ప్రజలను హింసించడం ద్వారా తాను మంచి పని చేస్తున్నానని అనుకున్నాడు పౌలు (యోహాను 16:2తో పోల్చండి). దేవుడు తనకిచ్చిన వెలుగును బుద్ధిపూర్వకంగా తిరస్కరించలేదు. సత్యమని తాను అనుకొన్నదాన్ని నమ్మడానికి ఇష్టపూర్వకంగా నిరాకరించలేదు. కానీ మనుషులు తెలిసి మనస్ఫూర్తిగా క్రీస్తునూ ఆయన శుభవార్తనూ తిరస్కరిస్తే (చాలమంది చేస్తున్నారు గదా) వారికి కరుణ అందుబాటులో లేకుండా చాలా దూరమై పోవచ్చు (మత్తయి 12:23-24; హీబ్రూ 2:2-3; 6:4-8; 10:26-31; 12:25-29; సామెత 1:22-23 పోల్చి చూడండి).
5.) హాని చేసినవారి కొరకు.
(మొదటి తిమోతికి) 1:13
13.నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
6.) అజ్ఞానుల కొరకు.
(మొదటి తిమోతికి) 1:13
13.నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
7. దేవదూషకుల కొరకు.
(మొదటి తిమోతికి) 1:13
13.నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
8.) “లోకము కొరకు.
(యోహాను సువార్త) 1:29
29.మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
1:29 పాత ఒడంబడిక గ్రంథంలో వర్ణించిన బలులను “గొర్రెపిల్ల” అనేమాట గుర్తుకు తెస్తూవుంది. లేవీ 1:2, 10-14; 3:6-8; 14:12, 21, 24; నిర్గమ 12:3-13; ఆది 22:7-14. తండ్రి అయిన దేవుడు పాపాలను తీసివేసేందుకు యేసుప్రభువును బలిగా చేస్తాడని యోహాను ఉద్దేశం. రోమ్ 3:25; 1 కొరింతు 5:7; ఎఫెసు 5:2; హీబ్రూ 9:26; 10:12; 1 పేతురు 1:19 పోల్చి చూడండి. ఈ బలి పాత ఒడంబడిక బలుల్లాగా ఇస్రాయేల్‌లోని వ్యక్తుల కోసమో, ఆ జాతి అంతటి కోసమో కాదు. ఇది మానవ జాతి అంతటికోసం. యేసుప్రభువు మానవ పాపాన్నీ, దేవునికి మనిషి చెల్లించవలసిన రుణాల భారమంతటినీ తీసివేశాడు. అంటే మనుషులంతా పాపవిముక్తి పొందారని కాదు. రక్షణ మార్గం, పరిపూర్ణ క్షమాపణ మనుషులందరికీ అందుబాటులోకి వచ్చింది అని అర్థం.
9.) సంఘము కొరకు.
(ఎఫెసీయులకు) 5:25
25.పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
క్రీస్తు మరణించినపుడు ఏమి జరిగింది.
1.) మధ్యాహ్నం మధ్యరాత్రిగా మారింది.
(మత్తయి సువార్త) 27:45
45.మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
27:45 ఇది దేవుడు పంపిన అద్భుతమైన సూచన. పాపులకోసం న్యాయమైన శిక్షను భరిస్తున్నవాడుగా యేసు ప్రవేశించిన ఆత్మ సంబంధమైన అంధకారాన్ని ఇది సూచిస్తున్నది. 8:12; 22:13; 25:30; లూకా 22:53; ఎఫెసు 5:8; కొలస్సయి 1:13; 2 పేతురు 2:4, 17; యూదా 13 చూడండి. లోకానికి వెలుగుగా ఉన్న యేసు (యోహాను 8:12) అలా చీకటిలో మునగడం అంటే అది ఎంత భయంకరమైన అనుభవమో ఆయనకే తెలుసు.
2.) దేవాలయపు తెరపైనుండి క్రిందికి చినిగెను.
(మత్తయి సువార్త) 27:51
51.అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
27:51 దేవునినుంచి మరో అద్భుత సూచన. ఈ తెరకున్న అంతరార్థం కోసం నిర్గమ 26:31-33 నోట్ చూడండి. ఈ తెరను దేవుడే రెండు ముక్కలు చేశాడనుకోవడంలో సందేహం ఉందా? తెర చినగడమంటే క్రీస్తు బలి అర్పణ మూలంగా దేవుని సన్నిధిలోకి మార్గం ఏర్పడిందన్నమాట – హీబ్రూ 9:3, 8; 10:19-22. దాదాపుగా ఈ సమయంలో ఒక యాజి పవిత్ర స్థలంలో ధూప ద్రవ్యం వేస్తూ నిలబడి ఉంటాడు.
(నిర్గమకాండము) 26:31,32,33
31.మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.
26:31 “తెర”– 36:35-36. తరువాత దేవాలయం కోసం కూడా ఇలాంటిదే తెర చేశారు (2 దిన 3:14). ఈ తెర దీప స్తంభం, సన్నిధి రొట్టెలు ఉన్న పవిత్ర స్థలాన్ని ఒడంబడిక పెట్టెమీద నెలకొన్న దేవుని సన్నిధి ఉన్న అతి పవిత్ర స్థలం నుంచి వేరు చేసింది. యేసుప్రభువు మరణించగానే దేవాలయంలోని ఈ తెర రెండుగా చినిగింది (మత్తయి 27:51). ఇప్పుడైతే సజీవమైన నవీన మార్గం మనకు ఉంది. దానిగుండా ఎవరైనా యేసుప్రభువు పైని నమ్మకం ద్వారా అతి పవిత్ర స్థలంలో ఉన్న దేవుని సన్నిధానానికి రావచ్చు (హీబ్రూ 9:8; 10:19-22). క్రీస్తు మరణం వరకు దేవుని సన్నిధికి చేరే మార్గం పూర్తిగా వెల్లడి కాలేదు. పవిత్రత గురించి లేవీ 20:7 నోట్ చూడండి.
32.తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.
33.ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
(హెబ్రీయులకు) 9:3,8
3.రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
8.దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.
9:8 “పవిత్రాత్మ”– 3:7 (యోహాను 14:16-17 నోట్స్). ఇస్రాయేల్ వారి ప్రాయశ్చిత్త దినం ద్వారా దేవుని ఆత్మ ఏ పాఠం నేర్పించాడు? దేవుని సన్నిధిలోకి మార్గం ఇంకా వెల్లడి కాలేదని సన్నిధి గుడారం (తరువాత దేవాలయం) వాడకంలో ఉన్నంత కాలమూ ఇస్రాయేల్‌వారి ప్రముఖయాజి తప్ప వేరెవరూ అతి పవిత్ర స్థలంలోకి వెళ్ళలేకపోయారు. సన్నిధి గుడారంలో, దేవాలయంలో దేవుని సన్నిధి ఉన్నది అతి పవిత్ర స్థలంలో మాత్రమే. దేవుని సన్నిధికి చేరడంలో ఉన్న అడ్డంకులను గురించే గానీ ప్రవేశాన్ని గురించి సన్నిధిగుడారం చెప్పడం లేదు. నిర్గమ 27:9-19 నోట్ చూడండి.
ఆ యుగాల్లో సన్నిధి గుడారం లేకుండా ఎవరూ దేవుని సన్నిధికి రాలేదని కాదు. ఆది 5:24; 6:9; 27:7; నిర్గమ 33:14; కీర్తన 51:11; 89:15 పోల్చి చూడండి. అయితే ఆ యుగాల్లో దీన్ని సాధ్యం చేసే మార్గాన్ని ఇంకా దేవుడు వెల్లడించలేదు. ఇప్పుడు వెల్లడించాడు. కేవలం పవిత్రుడైన దేవుని సన్నిధిలోకి పాపాత్ములైన మనుషులు రాగలరు. అయితే వారి పాపాలను తీసివేసేందుకు క్రీస్తు చేసిన బలియాగం మాత్రమే దీన్ని సాధ్యం చేసింది – 10:19-20; 1 పేతురు 3:18.
తెర – 60 అడుగుల ఎత్తు; 4’/ అంగుళముల మందము.
భూమి వణికి బండలు బద్దలైనాయి.
(మత్తయి సువార్త) 27:51
51.అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
27:51 దేవునినుంచి మరో అద్భుత సూచన. ఈ తెరకున్న అంతరార్థం కోసం నిర్గమ 26:31-33 నోట్ చూడండి. ఈ తెరను దేవుడే రెండు ముక్కలు చేశాడనుకోవడంలో సందేహం ఉందా? తెర చినగడమంటే క్రీస్తు బలి అర్పణ మూలంగా దేవుని సన్నిధిలోకి మార్గం ఏర్పడిందన్నమాట – హీబ్రూ 9:3, 8; 10:19-22. దాదాపుగా ఈ సమయంలో ఒక యాజి పవిత్ర స్థలంలో ధూప ద్రవ్యం వేస్తూ నిలబడి ఉంటాడు.
పరిశుద్ధుల సమాధులు తెరువబడ్డాయి.
(మత్తయి సువార్త) 27:52
52.సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
27:52-53 క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ సంభవం రాసి ఉన్న చోటు ఇదొక్కటే. ఈ పవిత్రులకు తరువాత ఏం జరిగిందో మనకు తెలియదు. కన్ను మూయడం (వ 52) లేక నిద్రపోవడం బైబిల్లో చనిపోవడానికి తరచుగా వాడబడిన మాట (యోహాను 11:11, 14; అపొ కా 7:60 నోట్స్ చూడండి).
క్రీస్తు దేవుని కుమారుడని చెప్పబడెను.
(మత్తయి సువార్త) 27:54
54.శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.
ఎ. సిలువ మరణము ద్వారా కలిగిన మేలులు.
1.) జాతిపరమైన అడ్డుగోడలు తొలగిపోయాయి.
(ఎఫెసీయులకు) 2:13,14,15,16
13.అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
14.ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
15.ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
16.తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
2.) ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విముక్తి.
(గలతీయులకు) 3:14
14.ఇందును గూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
3.) పాపక్షమాపణ కలిగింది.
(ఎఫెసీయులకు) 1:7
7.దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
(మొదటి యోహాను) 2:2
2.ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
4.) దుష్టయుగము నుండి విముక్తి.
(గలతీయులకు) 1:4
4.మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి(దుష్టయుగమునుండి) విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను.
5.) నీతిమంతులముగా చేయబడితిమి.
(మొదటి పేతురు) 3:18
18.ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,
6.) మరణబలముగల అపవాది నశించాడు.
(హెబ్రీయులకు) 2:14
14.కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
7.) మరణశాసనము రద్దు చేయబడింది.
(హెబ్రీయులకు) 9:16,17
16.మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
17.ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
8.) సాతానుపై జయము కలిగింది.
(మొదటి యోహాను) 3:8
8.అపవాది(సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
9.) ‘నిత్యమరణం నుండి విడుదల కలిగింది.
(హెబ్రీయులకు) 2:14,15
14.కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
15.జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
10.) సమాధానము వచ్చియున్నది.
(కొలొస్సయులకు) 1:20
20.ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.
సిలువలో మరణించిన క్రీస్తు…
సిలువ అనగానే సహజముగా మనకు ఒక అడ్డకొయ్య, ఒక నిలువు కొయ్య గుర్తుకు వస్తాయి. సిలువ అంటే కేవలం కొయ్య మాత్రమే కాదు.
సిలువ అనగా….
- క్రీస్తుప్రేమను ప్రత్యక్షపరచునది.
- సిలువదేవుని మహత్తరమైన శక్తియై యున్నది.
- సిలువ సమాధానబంధమునై యున్నది.
- క్రైస్తవ జీవితమునకు పునాది వంటిది.
- సిలువ విజయానికి గుర్తుగానున్నది.
- సువార్తకు మూలము సిలువయే.
- సిలువ నిస్వార్థమునకు ప్రతీక.
- పరలోక భాగ్యమునకు సిలువయే కేంద్రబిందువు.
- ఐక్యతను వివరించుచున్నది.
- సిలువ శ్రమలకు కూడా సాదృశ్యము.
బి. సిలువ వేయబడిన క్రీస్తును…
1.) వెంబడించాలి.
(లూకా సువార్త) 9:23
23.మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
9:23 “సిలువ”– మత్తయి 10:38; 16:24 నోట్స్. “ప్రతి రోజూ” అనే మాట ప్రాముఖ్యమైనది. ప్రతివాడూ తన గురించీ క్రీస్తును గురించీ తనకు ఉన్న అభిప్రాయాన్ని ప్రతి ఉదయం మననం చేసుకుని ఎప్పటికప్పుడు గుర్తుంచు కోవాలి. ఒక్కసారి చేసి ఊరుకొని తరువాత మర్చిపోతే మనం దారి తొలగిపోతాం.
క్రీస్తు ఆదేశానుసారంగా ప్రవర్తించడం, తదనుగుణంగా జీవించడమే ఆయన్ను వెంబడించడం. క్రీస్తును వెంబడించటానికి ఒక అర్హత కావాలి. అదియే, మన సిలువను మనం మోయడం. వెంబడించుటలో సమర్పణ, శ్రమ కూడా వుంది.
2.) ప్రకటించాలి.
(మొదటి కొరింథీయులకు) 1:23
23.అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
(రెండవ కొరింథీయులకు) 4:10
10.యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.
పౌలు తన సిలువ నెత్తుకొని సాత్వికముతో సిలువ సువార్తను లోకానికి ప్రకటించాడు. సిలువ వేయబడిన క్రీస్తుకు సాక్షిగా నిలిచిపోయాడు. క్రీస్తు సారూప్యము ధరించి, లోకానికి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటయే మన యెడల దైవసంకల్పము.
3.) అతిశయించాలి.
(గలతీయులకు) 6:14
14.అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము
పౌలు తనకున్న జ్ఞానాన్నిబట్టి అతిశయించలేదు, వాక్చాతుర్యంబట్టి అతిశయించలేదు, తనకున్న ధనాన్నిబట్టి, పలుకుబడినిబట్టి అతిశయింలేదు గాని “మన ప్రభువైన క్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక” అనెను. లోకం సిలువను అసహ్యించుకుంటే పౌలు సిలువను హత్తుకొని అతిశయించాడు.
4.) జీవించాలి.
(గలతీయులకు) 2:20
20.నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
(రెండవ కొరింథీయులకు) 5:15
15.జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.
మనకు జీవము అనుగ్రహించుటకు క్రీస్తు సిలువలో మరణించెను. అప్పుడు మనము నూతన ఆత్మసంబంధమైన జీవమును పొందినాము. రోమా 6:4; గలతీ. 2:20. అయితే మనకొరకు ప్రాణం పెట్టిన ఒక మనుషునికి మనమేమి ఇవ్వాలి? క్రీస్తు కొరకే జీవిస్తూ, క్రీస్తుకు మన జీవితాంతము ఋణపడి వుండాలి. క్రీస్తునందలి ప్రియులారా !
ఇకనైన సిలువ విలువను గుర్తెరిగి, సిలువ సందేశమును ప్రకటిస్తూ, అనేకులను అగ్నిలోనుండి లాగి క్రీస్తురాజ్యమునకు హక్కుదారులను చేస్తూ, క్రీస్తు అడుగుజాడలలో నడుచుకుందాము.
మిషనరీ జీవిత చరిత్రల కొరకు ..cl ick here





