వెయ్యి యేండ్ల పరిపాలన (ప్రకటన 20:1-7)
What is the 1000 year rule In Bible
- లాటిన్ భాషలో ‘మిలె’ అనుమాట వాడబడినది. అనగా వెయ్యి (1000) అని అర్థం.
A. స్వభావం :
- “వెయ్యి సంవత్సరాలు” అను మాట బైబిల్లో 6 సార్లు కన్పిస్తుంది. ప్రకటన 20:1-7 ఇది భూమిపై క్రీస్తు పరిపాలనా కాలం ఎలా ఉంటుందంటే
- సాతాను పూర్తిస్థాయిలో ఈ కాలమంతా బంధింపబడి ఉంటాడు.
- ఈ కాలములో ఎవరికి ఎటువంటి శిక్షలు ఉండవు.
- హార్మెగిద్దోను యుద్ధానంతరం మరియు గోగు, మాగోగు యుద్ధ కాలానికిమధ్యలో ఉండు సమయాన్ని సూచిస్తుంది.
- ఈ పరిపాలన కాలం భూమి మీద అక్షరార్థముగా జరుగుతుంది.
- ఇది దైవ పరిపాలన కాలం. ప్రపంచానికి క్రీస్తే పరిపాలన విధానాన్నికలిగిస్తాడు.
- క్రీస్తు ఏడేండ్ల కాలము తర్వాత సంఘముతో భూమి మీదికి వచ్చి వెయ్యేండ్ల పరిపాలనను క్రీస్తుకొరకు హతసాక్షులైన వారితో కలిసి కొనసాగించు కాలం.
- ఈ పరిపాలనా కాలం ప్రపంచ వ్యాప్తముగా ఉంటుంది.
- అన్ని దేశాలు సంవత్సరానికి ఒక్కసారియైన యెరూషలేముకు ప్రాతినిధ్యం వహిస్తారు.
- మరణాలు తక్కువగా ఉంటాయి. పునరుత్థానాలు ఉండవు.
- ఒకే దేవుడు (ప్రభువైన యేసుక్రీస్తు) ఒకే రాజ్యం కనుక శాంతితో కూడిన వాతావరణము ఉంటుంది.
- యెరూషలేము ప్రపంచానికి ముఖ్యపట్టణంగా ఉంటుంది.
- వస్తు సంబంధమైన విషయాలతో, దీవెనలతో భూమి నిండించబడుతుంది.
- ఎటువంటి భయాలు గాని, ఆందోళనలు గాని లేకుండా ఋతువులుఫలభరితంగా ఉంటాయి.
- ప్రేమ, నీతి విస్తరిస్తుంది. జనులు నిర్భయముగా నివశించు కాలము.
- భూమిమీద నిరుపయోగమైన స్థలమే ఉండదు.
- గొప్ప గొప్ప రహదారులు భూమి చుట్టి వస్తాయి.(రోడ్ల నిర్మాణం ఉంటుంది)
- మనుషులకు హాని చేయకుండా జంతువుల స్వభావం మారుతుంది.
- మనిషి జీవించు సంవత్సరాలు అధికమవుతాయి.
- ఎడారులు అందముగా మారిపోతాయి.
- సహజ శరీరులు క్రీస్తువైపుకు ఆకర్షితులై, రక్షణ పొందుతారు.
- పౌర చట్టాలు, ఆధ్యాత్మిక చట్టాలు అన్ని దేశాలకు ఇవ్వబడతాయి.
- అందరికి ఒకే న్యాయం దొరుకుతుంది.
- ప్రపంచ వ్యాప్తంగా పక్షపాతం లేకుండా అభివృద్ధి ఉంటుంది.
- ఆర్ధిక అసమానతలు లేకుండా, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా యెరూషలేము నుండి నియంత్రించబడుతుంది.
- లంచాలు, అవినీతి, అన్యాయం అనే వాటికి తావు ఉండదు.
- మానవ పునరుత్పత్తి యధావిధిగా ఉంటుంది.
- యెరూషలేము దేవాలయపు ఆరాధనలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి.
- ఇశ్రాయేలీయులు వాగ్దానాలు అక్షరార్థముగా పొందుకుంటారు.
- అన్యులైన ప్రతి దేశానికి / జాతికి దేవుడే వారికి గుర్తింపును కలుగజేస్తాడు.
- ప్రభువును గూర్చిన జ్ఞానము అందరికి తెలియజేయబడుతుంది.
- అన్ని దేశాల మధ్య విబేధాలు ఏమి ఉండక, సామరస్యముగా నడుచుకొంటారు.
B. ఉద్దేశ్యము
- తిరుగుబాటును ముగించుటకు.
- పితరులతో చేసిన నిబంధనలను నెరవేర్చుటకు(అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు).
- పరిశుద్ధులకు వాస్తవాన్ని చూపించుటకు.
- యూదులను సమకూర్చి, వారిని ప్రపంచానికి తలమానికముగానిలువబెట్టుటకు.
- ప్రభువైన యేసుక్రీస్తు కొరకు త్యాగధనులైన పరిశుద్ధులను, రాజులను,యాజకులనుగా, ఉన్నత స్థానాలలో వారిని నిలబెట్టుటకు.
- పరలోకంలో ఉన్నట్లుగా భూమిమీద క్రీస్తు ద్వారా ఏకత్వం ఉండునట్లుగా.
- అన్య దేశాలకు తీర్పు తీర్చి, నీతి, న్యాయాలను స్థాపించుటకు.
- ప్రజలను నీతిపాలనలో నడిపించుటకు, వెయ్యేండ్ల శాశ్విత పరిపాలనాప్రభుత్వాన్ని స్థాపించుటకు.
- మెస్సయ్య పరిపాలనను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు జరుగుటకు,
- లోకంలో పాపం ప్రవేశించక ముందు ఉన్న ఆ లోకాన్ని తిరిగి స్థాపించుటకు.
c. వెయ్యేండ్ల పరిపాలన మరియు నూతన భూమి (పరిశుద్ధ యెరూషలేము పట్టణం) ఒక్కటి కాదు :-
సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత భూమి మీద క్రీస్తు విరోధి పాలన కొన్ని రాజ్యాల కూటమి (10 రాజ్యాలు) తో ప్రారంభం అవుతుంది. ఈ క్రమములో భూమిపై నివసిస్తున్న ప్రజలు రెండు విధాలుగా శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. పైనుండి దేవుని ఉగ్రత ముద్రలు విప్పుట, బూరలు ఊదుట, మరియు పాత్రలు కుమ్మరించుట ద్వారా భయంకరమైన శ్రమలు వస్తాయి, మరియు క్రీస్తు విరోధి ద్వారా ప్రజలు శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. మధ్యాకాశములో ప్రభువైన యేసుక్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు విశ్వాసులైన సంఘానికి తీరుస్తాడు. వారి (సంఘం) సాక్ష్యపు జీవితాన్ని బట్టి, క్రీస్తు నిమిత్త, వాక్యం నిమిత్త వారు చేసిన త్యాగాన్ని, బలిదానిన్ని బట్టి బహుమానాలు (విందు) పొందుకుంటారు. భూమిపై క్రీస్తువిరోధి ఘటసర్పపు (అపవాది) చేత ఆవరించబడి, అతనిచేత పూర్తి అధికారాన్ని పొందుకుంటాడు. మహాశక్తిగా ఎదుగుతాడు. తానే దేవుడనని చెప్పుకుంటాడు. తన విగ్రహాన్ని ప్రతి ఇంట పెట్టుకునేటట్లు ప్రజలను బలవంతము చేయిస్తాడు. వేరొక దేవుడు ఉంటే ఒప్పుకోడు. ఏడేండ్లు క్రీస్తువిరోధి పాలన తర్వాత, మధ్యాకాశములో ఉన్న ప్రభువైన క్రీస్తు మరియు సంఘము (ప్రభువు మహిమతో, దేవుని బూర శబ్దముతో మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఎత్తబడే విశ్వాసులు, ఏడేండ్ల శ్రమల కాలంలో యేసు కొరకు సాక్షులుగా నిలువబడి క్రీస్తు విరోధి చేత హతసాక్షులైన వారు మరియు 1,44,000 మంది మరియు ఇద్దరు సాక్షులు…) భూమిమీదికి దిగివచ్చును. దీనినే “క్రీస్తు రెండవ రాకడ” అని పిలువ బడుతుంది. మరియు హార్మోగిద్దోను యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధములో క్రీస్తుచేత క్రీస్తు విరోధి అగ్ని గుండములో పడవేయబడి మరణిస్తాడు. సాతాను 1000 సంవత్సరాలు ముగియు వరకు అగాధములో బంధింపబడతాడు. ఈ 1000 (వెయ్యి) సంవత్సరాల కాలమునే “క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన” అని పిలువబడుతుంది.
క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన భూమిపై అంతటా స్థాపించబడుతుంది. ఈ సమయంలో క్రీస్తు పరిపాలన భూమియందతటా ఉంటుంది. యెరూషలేమును కేంద్రము లేక ముఖ్యపట్టణముగా చేసుకొని క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఈ సమయములో లేఖనాలు చెప్పినట్లుగా క్రీస్తు సాక్ష్యం కొరకు శ్రమల కాలంలో హతసాక్షులైన వారు ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి సింహాసనము పై కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అంటే వెయ్యేండ్ల పరిపాలనలో క్రీస్తు వారు మరియు శ్రమల కాలములో క్రీస్తు సాక్ష్యం కొరకు హతసాక్షులైన వారు పాలకులుగా ఉంటారు. అయితే పాలించబడుచున్న ప్రజలు రెండు రకాలుగా ఉంటారు. అందులో మొదటివారు, మధ్యాకాశము నుండి దిగివచ్చిన మహిమపరచబడిన శరీరాలతో ఉన్న సంఘం మరియు మొదటి నుండి నివసిస్తూ వస్తున్న సామాన్య ప్రజలు (సశరీరులు) ఈ వెయ్యేండ్ల పాలనలో ఉంటారు. ఇదొక వైరుధ్యమైన జీవన విధానం. యెరూషలేములో ఉంటున్న అధికార వర్గం ప్రతి దేశానికి ఒక ప్రతినిధిని నియమిస్తుంది.
ముఖ్యగమనిక : క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలానికి మరియు నూతన పరిశుద్ధ యెరూషలేములో నివశించబోయే కాలానికి ముడిపెట్టి అనేక తప్పుడు బోధలు చేస్తున్నారు. ఇది సరియైనది కాదు. ఎలాగో ఆలోచిద్దాం – క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలములో ఉండబోయే విషయాలను అనగా ప్రజల జీవన ప్రమాణాలు, వాతావరణం, పరిపాలనా విధానం, ఆర్థిక వ్యవస్థ, మానవుని జీవితకాలం, ఆహార వ్యవహారాలు మొ.గునవి. ఆలోచనలోనికి తీసుకొని లోతుగా అధ్యయనంచేయాలి. మరొక ప్రక్క నూతన పరిశుద్ధ యెరూషలేము పట్టణము దాని నిర్మాణము, దానిలోని వాతావారణం, జంతువులలో వచ్చు మార్పు, మొ.నవి. ఆలోచన చేస్తే. రెండు పరిపాలనల పరిస్థితులు ఒకటిగా ఉండవు. అయితే 1000 ఏండ్ల పరిపాలనకు రాజు క్రీస్తే. నూతన భూమి, నూతన ఆకాశం అని చెప్పబడుచున్న నూతన యెరూషలేము పట్టణానికి కూడా రాజు క్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే ఈ రెండింటికి రారాజు లేక చక్రవర్తియై నాయకత్వం (రాజు) వహిస్తారు. ముఖ్యముగా యెషయా 65:17-25 వచనాలలో ఉన్న విషయాలన్ని ప్రకటన 21వ అధ్యాయములో ఉన్న విషయాలతో దాదాపుగా ఒకే పోలికగా ఉ ంటాయని అనుకొంటున్నారు. బోధకులు, పండితులు కాస్త పదే పదే రెండు వాక్య భాగాలను చదివి అర్థము చేసుకొని బోధించవలసినదిగా నా మనవి. పరిశుద్దాత్మ దేవుడు మనలందరిని సరియైన వాక్య విధానములో నడిపించును గాక!
క్రీస్తు జీవిత చరిత్ర కొరకు.. click here





